'టచ్ చేసి చూడు' సెన్సార్ పూర్తి ...ఫిబ్రవరి 2న విడుదల

  • IndiaGlitz, [Wednesday,January 24 2018]

మాస్ మహారాజా రవితేజ హీరోగా న‌టించిన చిత్రం 'టచ్ చేసి చూడు'. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ నాయిక‌లు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఫిబ్ర‌వ‌రి 2న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా...

నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ '' 'ట‌చ్ చేసి చూడు' చిత్రం సెన్సార్ పూర్త‌య్యింది. సినిమాకు 'యు/ఎ' స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. ఈ వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టైటిల్ సాంగ్‌కు, టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ర‌వితేజ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నార‌ని సర్వ‌త్రా అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. ఫిబ్ర‌వ‌రి 2న సినిమా విడుద‌ల‌వుతుంది. చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది'' అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం : జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు,కేశవ్ , ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ, ఛాయాగ్రహణం : చోటా.కె.నాయుడు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.

More News

సాయిపల్లవి చిత్రాలు ఒకే రోజున..

ఫిదా చిత్రంతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలర్ బ్యూటీ సాయి పల్లవి.

కృష్ణకుమారి మృతి పట్ల బాలకృష్ణ ప్రగాఢ సంతాపం

అలనాటి మేటి తార కృష్ణకుమారి నేడు తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రామారావుగారు ఎన్.ఏ.టి సంస్థలో తొలిసారి స్వయంగా నిర్మించిన 'పిచ్చి పుల్లయ్య'(1953)తో సహా దాదాపు పాతిక సినిమాల్లో కృష్ణకుమారి నాన్నగారి సరసన కథానాయికగా నటించారు.

అక్కినేని హీరోతో 'నిన్నుకోరి' దర్శకుడు?

తొలి చిత్రం 'నిన్నుకోరి'తో ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ.

ఆగష్టు నుంచి యన్.టి.ఆర్ బయోపిక్

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యన్.టి.ఆర్’.

మళ్ళీ వార్తల్లోకి వెంకీ, పూరీ కాంబినేషన్

సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్