ట‌చ్ చేసి చూడు.. డేట్ మారిందా?

  • IndiaGlitz, [Friday,December 22 2017]

రాజా ది గ్రేట్‌తో తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చారు మాస్ మ‌హారాజ్‌ ర‌వితేజ‌. ప్ర‌స్తుతం ఆయ‌న ట‌చ్ చేసి చూడుతో బిజీగా ఉన్నారు. నూతన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ‌.. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నారు. బెంగాల్ టైగ‌ర్ త‌రువాత రాశి ఖ‌న్నా మ‌రోసారి ఈ చిత్రంలో ర‌వితేజ‌కి జోడీగా న‌టిస్తోంది.

ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సీర‌త్ క‌పూర్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 13న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇప్పుడు ట‌చ్ చేసి చూడు రిలీజ్ డేట్ మారింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

జ‌న‌వ‌రి 25న ఈ సినిమాని విడుద‌ల చేసే దిశ‌గా నిర్మాత‌లు న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, వల్ల‌భ‌నేని వంశీ ఆలోచ‌న చేస్తున్నారని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం త‌రువాత‌ క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేసేందుకు ర‌వితేజ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.