కె.జి.ఎఫ్‌2లో టాప్ స్టార్

  • IndiaGlitz, [Tuesday,February 26 2019]

క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్ న‌టించిన కె.జి.ఎఫ్ చాప్ట‌ర్ 1 తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ భాష‌ల్లో విడుద‌లై సెన్సేష‌న్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. దీంతో అంద‌రి క‌న్ను కె.జి.ఎఫ్ 2 పై ప‌డింది. ఈ సినిమా ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌ర‌గాల్సి ఉంది.

ఈ సినిమా పై వ‌చ్చిన అంచ‌నాల‌ను పెంచేలా యూనిట్ ప్లాన్ చేస్తుంది. అందుకోసం బాలీవుడ్ నుండి సంజ‌య్ ద‌త్‌, ర‌వీనాటాండ‌న్‌ల‌ను న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం.

సంజు బాబాకు కెజిఎఫ్ 2 తొలి క‌న్న‌డ సినిమా అయితే.. ఇప్ప‌టికే ర‌వీనాటాండ‌న్ క‌న్న‌డ సినిమాల్లో న‌టించింది. ఒక‌వేళ ఆమె ఒప్ప‌కుంటే ఇది ఆమెకు మ‌రో క‌న్న‌డ సినిమా అయిన‌ట్లే.