దేవాలయాలు ప్రారంభించిన అగ్ర హీరోలు..

  • IndiaGlitz, [Wednesday,February 24 2016]
హైద‌రాబాద్ లోని ఫిలింన‌గ‌ర్ దైవ స‌న్నిధానంకు ఎంత ప్రాముఖ్య‌త ఉందో తెలిసిందే. ఈ ప్రాముఖ్య‌త‌ను మ‌రింత పెంచేలా ఈ దైవ స‌న్నిధానంలో మ‌రిన్ని దేవాల‌యాల‌ను ఏర్పాటు చేసారు. ఈ దేవాల‌యాల‌ను అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్ ఈరోజు ప్రారంభించ‌డం విశేషం.
ఈ సంద‌ర్భంగా ....
ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ....నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ గార్నిదేవాల‌యం నిర్మించ‌మ‌ని ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామి క‌ల‌లో ఆదేశించ‌డం జ‌రిగింద‌ట‌. నిజానికి ఈ రోజు ఆవిష్క‌రించ‌బ‌డ్డ మూడు దేవాల‌యాలు కోమ‌టిరెడ్డి, రాజ గోపాల్ రెడ్డి నిర్మించాల‌నుకున్నారు. నిమ్మ‌గ‌డ్డ వారి కోరిక మేర‌కు వారు ఒప్పుకున్నందుకు వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ...ఈ దైవ స‌న్నిధానంలో కొత్త దేవాల‌యాల‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే అవ‌కాశం క‌ల్పించినందుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ...సూర్య‌ భ‌గ‌వానుడి ఆల‌యాన్ని ఆవిష్క‌రించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ మాట్లాడుతూ...గ‌త కొంత కాలంగా ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామి క‌ల‌లో క‌నిపిస్తున్నారు. ఇటీవ‌ల దైవ స‌న్నిధానంకి వ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌డ ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామి విగ్ర‌హం లేక‌పోవ‌డం గ‌మ‌నించాను. దైవ స‌న్నిధానం క‌మిటీ వారిని ఆడిగితే త్వ‌ర‌లోనే ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామి ఆల‌యం నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలిపారు. నేనే నిర్మిస్తాన‌ని ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టాను. రెండు రోజులుగా ఈ కార్య‌క్ర‌మంలో ఉన్న నేను ప్ర‌పంచాన్ని మ‌ర‌చిపోయాను. ఈ అవ‌కాశం ఇచ్చిన క‌మిటీ వార్కి రుణ‌ప‌డి ఉంటాను అన్నారు.

More News

ఆ వార్తల్లో వాస్త‌వం లేదంటున్న చిరు

కేంద్ర మాజీ మంత్రి, రాజ్య‌స‌భ్యుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి బి.జె.పి లో చేరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లోఅయితే   చిరు బి.జె.పి కి ద‌గ్గ‌ర‌వుతున్నాడ‌ని...ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సి.ఎం అభ్య‌ర్ధిగా చిరంజీవిని  బి.జె.పి ప్ర‌క‌టించ‌నుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

బ్రహ్మోత్సవం లో మహేష్ కుమార్తె..

సూపర్ స్టార్ మహేష్ -శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రూపొందుతున్న బ్రహ్మోత్సవం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

తమిళ టీ.విలో వ్యాఖ్యాతగా తెలుగు హీరో...

తమిళ టీ.వి లోవ్యాఖ్యాత గా తెలుగు హీరోనా..?ఎవరా హీరో అనుకుంటున్నారా..?దగ్గుబాటి రానా.

హ్యాపీ బర్త్ డే టు నేచురల్ స్టార్ నాని..

అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు నాని.

పాటపాడనున్న హీరో

డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో నారా రోహిత్.