ప్రముఖ రచయిత-దర్శకుడు నంద్యాల రవి ఇక లేరు..
Send us your feedback to audioarticles@vaarta.com
‘నేనూ సీతామహాలక్ష్మీ, పందెం, అసాధ్యుడు’ వంటి చిత్రాలతో రచయితగా తన సత్తా చాటుకుని... ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రంతో దర్శకుడిగా మారిన నంద్యాల రవి(42) శుక్రవారం కరోనాతో కన్నుమూశారు. తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేసుకుంటూనే... రచయితగా వస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్న యువ ప్రతిభాశాలి నంద్యాల రవిని కరోనా కాటేసింది.
Also Read: గుండె పగిలే వార్త ఇది.. ధీర యువతి ఇకలేరు!
కొన్ని రోజుల ముందు ఈయన కరోనా బారిన పడటంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి నంద్యాల రవి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో రవి నేటి ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రవికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రవి స్వస్థలం పాలకొల్లు సమీపంలోని సరిపల్లి (గణపవరం పక్కన). రవి ఆసుపత్రిలో తీసుకుంటుండగా ఆయనకు పలువురు ఆర్ధిక సాయం అందించారు. నటుడు సప్తగిరి ఆయనకు లక్ష రూపాయల సాయం అందించారు.
నిజానికి సప్తగిరిత సినిమా చేసేందుకు రవి కథను సిద్ధం చేసుకున్నారు. అన్నీ బాగుంటే కరోనా ప్రభావం కాస్త తగ్గిన మీదట ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చి ఉండేది. ఇక కోలుకుని ఇంటికి వచ్చేస్తున్నాడనగా... కరోనా అతడ్ని బలి తీసుకోవడం బాధాకరం. నంద్యాల రవి మృతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు వల్లూరిపల్లి రమేష్ బాబు, కె.కె.రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్.. ప్రముఖ దర్శకులు విజయ్ కుమార్ కొండా, ప్రముఖ నటులు సప్తగిరి, ధన్ రాజ్ తదితరులు రవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విజయ్ కుమార్ కొండా-రాజ్ తరుణ్ కలయికలో రీసెంట్‌గా వచ్చిన 'ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే' చిత్రాలకు రవి రచయితగా పని చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments