మహేష్ తర్వాత సూర్యతో.. స్క్రిప్ట్ రెడీ ?
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు సూర్య. పాత్ర నచ్చితే అందులోకి పరకాయ ప్రవేశం చేసి తన విలక్షణ నటనతో మెప్పించడం సూర్యకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగులో స్ట్రైట్ మూవీ చేసేందుకు సూర్య చాలా కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కుదరడం లేదు.
తాజాగా సూర్య తెలుగు స్ట్రైట్ చిత్రానికి తొలి అడుగు పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా రోజులుగా సూర్యతో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. తాజా సమాచారం మేరకు త్రివిక్రమ్ సూర్య ని దృష్టిలో పెట్టుకుని ఒక కథ రెడీ చేశారట.
ఇదీ చదవండి: పవన్, రానా మూవీ క్రేజీ అప్డేట్.. ఇక పోలీస్ స్టేషన్ లో..
ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం తర్వాత సూర్యని డైరెక్ట్ చేసే విషయంలో మరింత క్లారిటీ రావచ్చు. సూర్య కూడా త్రివిక్రమ్ తో వర్క్ చేసేందుకు చాలా సార్లు ఆసక్తి కనబరిచారు. గజినీ, సింగం సిరీస్ లాంటి చిత్రాలు సూర్యకు తెలుగులో క్రేజ్ పెంచాయి.
ఇదిలా ఉండగా బోయపాటి దర్శత్వంలో కూడా సూర్య నటించబోతున్నాడని.. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో క్రేజీ తమిళ హీరో విజయ్ త్వరలో తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com