మణిరత్నం ‘నవరస’లో టాలీవుడ్ స్టార్స్..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ ఏస్ డైరెక్టర్స్‌లో మణిరత్నం పేరు ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఈ దర్శక నిర్మాత ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారని సమాచారం. మనిషి ప్రదర్శించే తొమ్మిది రసాలను ఆధారంగా చేసుకుని ‘నవరస’ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మది ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ రసం చుట్టూ తిరుగుతుంటుంది. అలాగే ఒక్కొక్క ఎపిసోడ్‌ను మణిరత్నంతో కలిపి తొమ్మిది మంది దర్శకులు తెరకెక్కించనున్నారట.
ఇందులో సూర్య, విక్రమ్, మాధవన్, సిద్ధార్థ్ వంటి హీరోలు కూడా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. వీరితో పాటు తెలుగు హీరోలను కూడా మణిరత్నం ఈ వెబ్ సిరీస్‌లో నటింప చేయాలని అనుకుంటున్నారట. నాగార్జున, నాగచైతన్య, నాని, కార్తికేయ వంటి హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నాయని టాక్. ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ కోసం మణిరత్నం ఈ వెబ్‌సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నాడట. మరి మణిరత్నంతో పాటు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయబోయే దెవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com