Vijay Devarakonda : ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో కలకలం , అంతా ‘‘లైగర్’’ వల్లేనా..?

  • IndiaGlitz, [Wednesday,November 30 2022]

టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరవ్వడం కలకలం రేపింది. కొద్దిరోజుల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో మనీలాండరింగ్, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి కౌర్‌లు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. లైగర్ సినిమాలో కొందరు రాజకీయ నాయకులు కూడా పెట్టుబడులు పెట్టినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అనుమానిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు పెట్టుబడిగా పెట్టిన నగదును దుబాయ్‌కి పంపించి అక్కడి నుంచి లైగర్‌లో ఇన్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అభిమానులను నిరాశపరిచిన లైగర్:

ఇకపోతే.. బాక్సింగ్ కథాంశంతో తెరకెక్కిన లైగర్ ఎన్నో అంచనాల మధ్య రిలీజై అభిమానులకు నిరాశను మిగిల్చింది. అంతేకాకుండా.. ఛార్మీ, పూరి జగన్నాథ్‌లపైనా విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. అలాగే విజయ్, ఛార్మీ, పూరికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఈ కారణం వల్లే పూరితో చేయాల్సిన జనగణమన ప్రాజెక్ట్ నుంచి విజయ్ దేవరకొండ తప్పుకున్నాడని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపించాయి.

ఓ రాజకీయ నేత ప్రమేయంపై ఆరా:

లైగర్ అనంతరం జనగణమణ చిత్రాన్ని రూపొందించే ఉద్దేశంతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడమే కాకుండా.. ఇందుకోసం రూ. 20 కోట్లు కూడా ఖర్చు చేశారని ప్రచారం జరిగింది. ఈ ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలోనే అప్పుడు లైగర్ కోసం ఫండింగ్ చేసిన వారి వివరాలను సేకరించేందుకు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ప్రధానంగా ఓ రాజకీయ నాయకుడి ప్రమేయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం వుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

More News

Vaarasudu: 'వారసుడు' ఫస్ట్ సింగిల్ 'రంజితమే' విడుదల

దళపతి విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి క్రేజీ కాంబినేషన్‌ లో భారీ అంచనాలు ఉన్న వారసుడు/వారిసు చిత్రం

BiggBoss: 'టికెట్ టు ఫినాలే' టాస్క్ స్టార్ట్... ఇనయా- శ్రీహాన్‌ల రొమాన్స్, శ్రీసత్యకు కాలినట్లుందే..!!

బిగ్‌బాస్ 6 తెలుగు చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టికెట్ టు ఫినాలే స్టార్ట్ అయ్యింది.

Shriya Saran : 40 ఏళ్ల వయసు, పెళ్లయి కూతురు కూడా.. అయినా ఏముందిరా బాబు

శ్రీయా శరణ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అందం , అభినయంతో ప్రేక్షకుల మదిలో సుస్ధిర స్థానం సంపాదించారు శ్రీయ.

Namrata Shirodkar : రమేశ్ బాబు కూతురి గురించి నమ్రత పోస్ట్.. ఎవరైనా ఎమోషనల్ కావాల్సిందే

దిగ్గజ నటుడు , సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.

Meena : రెండో పెళ్లికి సిద్ధమవుతోన్న మీనా.. వరుడెవరంటే..?

వివాహ బంధంలో మనస్పర్ధల కారణంగా జీవిత భాగస్వామితో విడిపోయి సింగిల్‌గా వుంటోన్న సినీతారలు ప్రస్తుతం తోడు వెతుక్కునే పనిలో పడ్డారు.