గాడ్ ఫాదర్ సెట్స్‌కి పూరి జగన్నాథ్.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మెగాస్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్నది ఎంతో మంది దర్శకుల కల. మధ్యలో ఆయన సినిమాలకు గ్యాప్ ఇవ్వకుంటే ఎంతోమంది కోరిక నెరవేరిది. అయినప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ దర్శకులు కాకుండా.. నేటి తరానికి అవకాశం కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు చిరంజీవి. వెంకీ కుడుముల, బాబీ తదితరులతో మెగాస్టార్ సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. చిరును డైరెక్ట్ చేయాలని కలలు కన్నవారిలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఒకరు. పలుమార్లు వీరిద్దరి మధ్య కథా చర్చలు జరగినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. అదే సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో పూరి జగన్నాథ్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.
అయితే ఆయనను డైరెక్ట్ చేయలేకపోయినా.. చిరంజీవి పక్కన నటించే ఛాన్స్ కొట్టేశారు పూరి. ప్రస్తుతం మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో తెరకెక్కిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి వారు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ ను యాడ్ చేయబోతున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘గాడ్ ఫాదర్’లో గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇటీవల ఆయన షూటింగ్లో జాయిన్ అయ్యారు. పూరి జగన్నాథ్‌కు పుష్పగుచ్ఛం అందించిన మెగాస్టార్ సెట్స్‌లోకి వెల్కమ్ చెప్పారు. ఈ మేరకు చిరంజీవి శనివారం ట్వీట్ చేశారు. "వెండితెరపైన నటుడిగా వెలుగు వెలగాలని నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ, అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా! అందుకే, నా పూరి జగన్నాథ్‌ను ఓ ప్రత్యేక పాత్రలో పరిచయం చేస్తున్నాను" అని 'గాడ్ ఫాదర్' సెట్స్‌లో దిగిన ఫొటోను షేర్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com