కరోనా నేపథ్యంలో ఇటలీలో తెలుగు గాయనికి నరకం!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు సెల్ఫ్ క్వారంటైన్ అనగా స్వీయ నిర్భందం విధించికుని ఇంట్లో నాలుగు గోడలకే పరిమితం అయ్యారు. ఇలా దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. చైనాలో రోజురోజుకు పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ.. ఇటలీలో మాత్రం శవాల దిబ్బగా మారుతోంది. ఇటలీలో మాత్రం రోజురోజుకూ మరణాల సంఖ్య భారీగానే పెరిగిపోతోంది.
ఇటలీలో.. అసలేం జరుగుతోంది!?
అయితే.. ఇటలీలో ఉన్న టాలీవుడ్ లేడీ సింగర్ శ్వేతా పండిట్.. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయ్..? వాస్తవిక పరిస్థితులేంటి..? అనే విషయాలను ఐదు నిమిషాల నిడివి గల వీడియోతో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ప్రపంచాన్ని కరోనావైరస్ ఎంత దారుణమైన పరిస్థితులను కల్పించిందో అందరికీ తెలిసిందే. భారత్‌లో కూడా లాక్డౌన్ కొనసాగుతోందని తనకు తెలిసిందని చెప్పింది. ‘
కళ్లేదుటే మరణాలు...
ఇటలీలోని పరిస్థితులు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రపంచంలో భారీగా ఎఫెక్ట్ అయిన దేశంగా ఇటలీ మొదటి స్థానంలో ఉంది. ప్రతీ రోజు ఉదయమే అంబులెన్స్‌ల సైరన్లతో నిద్రలేస్తున్నా. కళ్లేదుటే మరణాలు.. ఇదంతా వాస్తవం. నేను ఇక్కడ క్వారంటైన్లో ఉన్నాను. ఈ వైరస్ భారీ నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ఇలా చేస్తున్నాను. ఇటలీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకునేలోపే అంతా జరిగిపోయింది. వేలల్లో మరణాలు సంభవించాయి. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పట్నుంచి నేను ఇంటి నుంచి బయటకు రాలేదు.. ఇప్పటికీ ఇంట్లోనే ఉంటున్నాను. నా ఆరోగ్యం గురించి పలు దేశాల నుంచి కాల్ చేసి వాకబు చేస్తున్నారు. నా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల ప్రేమ వల్లనే నేను సేఫ్‌గానే ఉన్నాను’ అని వీడియోలో శ్వేతా తెలిపింది.
సూచనలు..
‘మీరందరూ ఈ వ్యాధితో పోరాడి ఓడించాలని నేను కోరుకుంటున్నాను. ప్రాణాంతక వ్యాధిని మనమంతా ఓడించాలంటే.. ఇంటి వద్దనే ఉండాలని చెప్పింది. చేతులు శుభ్రంగా కడుక్కోండి.. మీ కుటుంబ సభ్యులతో కూడా దూరం నుంచి మాట్లాడండి. వీడియో కాల్ ద్వారా స్నేహితులతో సన్నిహితంగా ఉండండి. సంగీతం వినండి, ఏదైనా చదవండి, విశ్రాంతి తీసుకోండి. సురక్షితంగా ఉండండి..’ అని శ్వేతా సూచనలు చేసింది.
ఎవరీ శ్వేతా..!?
కాగా.. ‘కొత్త బంగారు లోకం’ మూవీలో ‘నేనని నీవని’.. సైజు జీరో సినిమాలో ‘మెల్ల మెల్ల’.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సమంత సోలో సాంగ్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘మహానుభావుడు’, ‘ఓం నమో వెంకటేశయ:’, ‘ముకుంద’ ఇలా చాలా తెలుగు సినిమాల్లో తనదైన పాటలు పాడి అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు.. బాలీవుడ్‌లోనూ పాడింది. అలా రాణిస్తున్న టైమ్‌లో ఇటలీలో సెటిలైపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com