చిరు సుప్రీం.. ఆయనకు అలాంటి పదవులేం అక్కర్లేదు..!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా.. పెద్దన్న ఉంటూ ఎలాంటి సమస్యలు తన దృష్టికి వచ్చినా పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. గతంలో ఇలాంటి పనులన్నీ దివంగత నేత. దర్శకుడు దాసరి నారాయణ చూసేవారు. ఆయన మరణాంతరం ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’, ‘మా’లో విబేధాలతో పలు విషయాల్లో గొడవలు జరిగినప్పటికీ పైకి చిరు పేరు రాకున్నప్పటికీ అన్ని సమస్యలను ఆయనే పరిష్కరించారని టాక్ నడిచింది. అయితే తాజాగా.. ఆయనకు ప్రభుత్వం అందించే నంది అవార్డుల కమిటీకి చైర్మన్ పదవి ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని.. ఇటీవల తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ భేటీలో ఈ విషయంపై కూడా చర్చించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
నేను అస్సలు ఒప్పుకోను!!
చిరంజీవికి సంబంధించిన ఎలాంటి విషయంపై అయినా ఇండస్ట్రీ నుంచి మొదట స్పందించే వ్యక్తి తమ్మారెడ్డి. చైర్మన్ పదవిపై ఆయన స్పందిస్తూ.. చిరుకు అలాంటి పదవులేం అక్కర్లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు.. ఆయన్ను చైర్మన్గా వ్యవహరిస్తే తాను అస్సలు ఒప్పుకోనని కూడా స్పష్టం చేశారు. నిజానికి ఈ పదవిలో ఉండాల్సింది ఖాళీగా ఉండే వ్యక్తులని.. చిరు ఎప్పుడూ బిజిబిజీగా ఉంటారన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవికి ఆ పదవి చాలా చిన్నది.. అదేం అక్కర్లేదన్నారు.
చిరు సుప్రీం..!
రేపొద్దున్న కమిటీలో ఏదైనా సమస్య వస్తే దాన్ని చిరుపైకి నెట్టే ప్రయత్నాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. మెగాస్టార్ ఇండస్ట్రీకి సుప్రీం అని ఆయన ఏదైనా సరే చేయగలిగే స్థాయిలో ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా తమ్మారెడ్డి గుర్తు చేశారు. ‘మా’ గొడవలపై మాట్లాడిన ఆయన.. విబేధాల గురించి మీడియా వాళ్లు ఏదే జరిగిపోయిందని రాసేస్తున్నారని.. అవన్నీ ఇంటర్నల్ సమస్యలని ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. కాగా.. తమ్మారెడ్డి వ్యాఖ్యలకు చిరు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments