మనసు చంపుకుని మరీ సినిమాల్లో చేస్తున్నా!!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటి ‘సుధ’ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. తల్లి మొదలుకుని అక్క, వదిన, అత్తమ్మ ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ఇంతకుముందు’, ‘ఆమె’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలను చేశానని.. ఆ పాత్రలు తనకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయని చెప్పుకొచ్చింది.
అంతటితో ఆగని ఆమె.. తాను చేసిన కొన్ని కొన్ని పాత్రలు ఒక నటిగా తనకు సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చాయంది. అయితే కొన్ని కొన్ని సినిమాల్లో మనసు చంపుకుని మరీ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇటీవల కాలంలో తనకు వచ్చిన పాత్రల్లో పెద్దగా విషయం లేకుపోవడంతో సినిమాలు తగ్గించేశానని.. కేవలం డబ్బుకోసమే నటించాలనుకుంటే ఇప్పటికే చాలా ఎక్కువ సినిమాల్లో నటించేందాన్ని అని ఆమె చెప్పింది. అందుకే తాను.. ఒక నటిగా సంతృప్తి ముఖ్యం గనుక.. మనసుకు నచ్చిన పాత్రలను మాత్రమే అంగీకరిస్తున్నానని నటి సుధ చెప్పుకొచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments