Dil Raju : టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు ఇంట్లో మరో విషాదం

  • IndiaGlitz, [Tuesday,October 10 2023]

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యాంసుందర్ రెడ్డి సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

శ్యాంసుందర్ రెడ్డి భార్య ప్రమీలమ్మ.. ఈ దంపతులకు ముగ్గురు సంతానం . వీరు దిల్‌రాజు (వెంకట రమణారెడ్డి) , విజయ్ సింహారెడ్డి , నరసింహారెడ్డి. ఈ కుటుంబానిది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా. చిన్నప్పటి నుంచి వెంకట రమణారెడ్డిని రాజు రాజు అని పిలుస్తూ వుండటంతో ఆయన పేరు రాజుగా మారింది. ఆ తర్వాత దిల్‌ సినిమా ఘన విజయం సాధించడంతో అప్పటి నుంచి దిల్‌రాజుగా మారింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా తెలుగు సినిమాను శాసించగల అతికొద్ది మందిలో ఒకరిగా దిల్‌రాజు నిలిచారు.

దిల్‌రాజు తొలుత అనితను వివాహం చేసుకున్నారు. ఆమె 2017లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన డిసెంబర్ 10, 2020న తేజస్విని అనే బంధువుల అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. అంతకుముందే దిల్‌రాజుకు అనిత ద్వారా హన్షిత జన్మించింది. ఈమెకు కూడా వివాహమైన సంగతి తెలిసిందే.

More News

Vote Apply:అక్టోబర్ 31 వరకు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు.. అభ్యర్థులు, ప్రజలకు తెలంగాణ సీఈవో సూచనలు

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ అభ్యర్థులు, ప్రజలకు పలు సూచనలు చేశారు.

Telugu Comedian:దర్శకుడిగా మారబోతున్న మరో తెలుగు కమెడియన్‌

టాలీవుడ్‌లో మరో కమెడియన్ దర్శకుడుగా మారబోతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో పాటు జబర్దస్త్‌ షో ద్వారా కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు..

CM KCR:నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి స్థానాలకు సీఎం కేసీఆర్ నామినేషన్లు

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

CM Jagan:రాజకీయ కక్ష సాధింపుతో చంద్రబాబును అరెస్టు చేయలేదు.. సీఎం జగన్ క్లారిటీ

టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు చెయ్యలేదని.. ఆయనపై తనకు ఎలాంటి కక్ష లేదని సీఎం జగన్ తెలిపారు.

Chandrababu:చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.