అల్లు అరవింద్ భారీ ప్లాన్.. లైన్ లోకి ఇలయథలపతి ?

బాహుబలి పుణ్యమా అని చిత్ర పరిశ్రమల మధ్య భాష అడ్డుగోడలు తొలగిపోయాయి. ప్రాంతీయ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రాలు కూడా ఇప్పుడు ఇండియా మొత్తం మార్కెట్ చేసుకుంటున్నాయి. దర్శకనిర్మాతలు కూడా పరభాషా నటులతో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

తమిళ హీరో ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అలాగే వెంకీ అట్లూరికి కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇలయథలపతి విజయ్ క్రేజ్ తమిళంలో ఆకాశాన్ని తాకుతోంది. విజయ్ కూడా స్టైట్ గా తెలుగులో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇదీ చదవండి: లెజెండ్రీ నటుడు దిలీప్ కుమార్ మృతి.. మోడీ, రాహుల్, ఎన్టీఆర్ సంతాపం

దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇలయథలపతి విజయ్ తో సినిమా నిర్మించేందుకు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆసక్తి చూపుతున్నట్లు టాక్. వీరిద్దరి మధ్య ప్రారంభ దశ చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. విజయ్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి కథ చేయాలి, దర్శకుడు ఎవరు ఇలాంటి అంశాల్లో ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కథల ఎంపిక, ప్లానింగ్ విషయంలో అల్లు అరవింద్ పక్కాగా ఉంటారు. అందుకే గీతా ఆర్ట్స్ బ్యానర్ విజయవంతంగా దూసుకుపోతోంది.

ప్రస్తుతం విజయ్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

More News

లెజెండ్రీ నటుడు దిలీప్ కుమార్ మృతి.. మోడీ, రాహుల్, ఎన్టీఆర్ సంతాపం

లెజెండ్రీ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్(98) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

హీరో సూర్యపై విమర్శల దాడి.. సీపీఎం, డివైఎఫ్ఐ మద్దతు!

నీట్ పరీక్షలు, సెన్సార్ చట్ట విధి విధానాలపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు స్టార్ హీరో సూర్య. నీట్ పరీక్షల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు అని సూర్య అన్నారు.

వకీల్ సాబ్ ప్రూవ్ చేసింది.. అల్లు అరవింద్ ప్రోత్సాహంతో ముందుకు..

ప్రముఖ పీఆర్వో, నిర్మాత శ్రీనివాస్ కుమార్(ఎస్కెఎన్) జూలై 7న తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు.

మంత్రి కేటీఆర్ ని కలిసిన సోనూసూద్.. ఆ ఇద్దరు దర్శకులు కూడా..

సోనూసూద్ దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులని సొంతం చేసుకున్నాడు. బడా సెలెబ్రిటీలు కూడా సోనూసూద్ అభిమానులుగా మారిపోతున్నారు.

ఇండియాలో ప్రభాస్, పృథ్విరాజ్.. వర్చువల్ ప్రొడక్షన్ విప్లవం మొదలు

ఫిల్మ్ మేకింగ్ అనేది స్థిరమైన ప్రక్రియ కాదు. కాలానుగుణంగా, టెక్నాలజీ పరంగా అనేక మార్పులు వస్తుంటాయి.