జగన్ కోసం.. వైసీపీలోకి టాలీవుడ్ ప్రముఖులు!
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీలో రోజురోజుకు వలసలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలకనేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు టాలీవుడ్లో పెద్ద ఎత్తున నటీనటులు వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. తాజాగా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి వైసీపీలో చేరారు. ఆదివారం రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్వీ మోహన్ రెడ్డి, అచ్చిరెడ్డి మీడియాతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ వస్తే మంచి జరుగుతుంది..!
"ప్రజల కోసం నిత్యం ఆలోచించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పాదయాత్రలో ప్రతి వ్యక్తి బాధ జగన్ తెలుసుకున్నారు. ప్రజలకు ఏదో చేయాలన్న తపన వైయస్ జగన్‌లో ఉంది. ప్రజలను సొంత కుటుంబంలా జగన్ భావిస్తారు. ప్రజలను ఆదుకోవాలని ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. జగన్ ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. జగన్ వస్తే మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.
జగన్‌కు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఆయనపై ఎన్ని కుట్రలు చేసిన ప్రజల కోసం బాధ్యతగా, ధైర్యంగా ముందుకెళ్తున్నారు. మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తి జగన్. ఏమి చేస్తే ప్రజల కష్టాలు తీరుతాయో వైయస్ జగన్ ప్రతిక్షణం ఆలోచన చేస్తున్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రజల కోసమే చేశారు. విద్య,ఆరోగ్యం ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నారు" అని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.
తండ్రిలాగే జగన్ ప్రజలకు మంచిచేస్తారు!
"ప్రజల కోసం బాగు కోసం కృషిచేస్తున్న జగన్మోహన్రెడ్డిని గెలిపించాలి. తన తండ్రిలాగే జగన్ ప్రజలకు మంచి చేస్తారు. జగన్ సీఎం అయితే ఏపీకి మేలు జరుగుతుంది. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు జగన్ తెలుసుకుని వారిని ఆదుకోవడానికి కృషిచేస్తున్నారు. ప్రజలకు మంచి జరిగే పనులకే జగన్ ప్రాధాన్యత ఇస్తారన్నారు.
ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్న వారే ప్రజానాయకుడు అవుతారు. ఎన్టీఆర్, వైయస్ఆర్ లక్షణాలు జగన్‌లో ఉన్నాయి. ప్రజలకు మంచి చేయాలనే దృఢ సంకల్పంతో జగన్ ఉన్నారు. స్వార్థ ప్రయోజనాలు కోసం తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టించవద్దు" అని కొందరిని ఉద్దేశించి అచ్చిరెడ్డి వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout