టాలీవుడ్ ప్రముఖ సినీ గీత రచయిత కన్నుమూత

  • IndiaGlitz, [Thursday,August 15 2019]

టాలీవుడ్ ప్రముఖ సినీ గీత రచయిత శివ గణేశ్ తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో వనస్థలిపురంలోని తన నివాసంలో శివగణేశ్ కన్నుమూశారు. మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచిన ఎన్నో చిత్రాలకు గేయ రచయితగా పనిచేశారు. తెలుగులో డబ్బింగ్‌ చిత్రాలుగా రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించిన ‘ప్రేమికుల రోజు’, ‘నరసింహ’, ‘జీన్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘బాయ్స్’, ‘7జీ బృందావన్ కాలనీ’, ‘ఎంతవారుకానీ’, ‘ఉల్లాసం’, ‘ఆస్తి మూరెడు- ఆశ బారెడు’ లాంటి సినిమాలకు శివగణేష్ సాహిత్యం అందించారు. శివ గణేశ్ వెయ్యికిపైగా సినిమాలకు పాటలు రాశారు.

కాగా.. శివగణేశ్‌కు భార్య నాగేంద్రమణి, కుమారులు సుహాస్‌, మానస్‌ ఉన్నారు. తండ్రి ఇకలేడన్న వార్త తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. శివ ఒక్క తెలుగునే కాకుండా పలు తమిళ సినిమాలకు కూడా ఆయన పనిచేశారు. రచయిత ఇకలేరన్న విషయం తెలుసుకుని ఆయన మృతికి పలువురు తెలుగు, తమిళ సినిమా రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇవాళ సాయంత్రం శివ గణేష్ అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.

More News

ఈసారి పూర్తి భిన్నంగా ప్రెజెంట్ చేస్తున్న శేఖర్ కమ్ముల

`ఫిదా` చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ శేఖర్ తర్వాత కొత్త నటీనటులతో ఓ సినిమాను ప్రారంభించినా ఎందుకనో ఆ సినిమా పక్కన పెట్టి..

బన్నీ చిత్రంలో మరదలు?

అల్లు అర్జున్ చిత్రంలో అతని మరదలు నిహారిక నటించనుందా? అంటే అవుననే సమాధానం ఫిలిమ్ నగర్ వర్గాల్లో వినపడుతుంది.

400 మందికి బంగారు రింగులు ఇచ్చిన హీరో

తమిళ స్టార్ హీరో విజయ్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `బిగిల్`. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది.

ఇక ఎప్పటికీ ఆ ‘హీరో’తో దిల్‌రాజు సినిమా చేయరా!?

ఎస్ మీరు వింటున్నది నిజమే.. ఇక ఎప్పటికీ ఆ హీరోతో సినిమా తీయకూడదని సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఫిక్స్ అయిపోయారని సమాచారం.

పోస్ట్ ప్రొడక్షన్‌లో 'అమ్మాయి ప్రేమలో పడితే'

ఎ.ఎస్.ఎం.ఆర్ సమర్పణలో అరిగెల ప్రొడక్షన్స్‌ బేనర్‌పై మణీందర్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ హీరోగా నటిస్తున్న చ్తిరం `అమ్మాయి ప్రేమలోపడితే`.