టాలీవుడ్ ప్రముఖ సినీ గీత రచయిత కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ సినీ గీత రచయిత శివ గణేశ్ తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో వనస్థలిపురంలోని తన నివాసంలో శివగణేశ్ కన్నుమూశారు. మ్యూజికల్ హిట్స్‌గా నిలిచిన ఎన్నో చిత్రాలకు గేయ రచయితగా పనిచేశారు. తెలుగులో డబ్బింగ్ చిత్రాలుగా రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన ‘ప్రేమికుల రోజు’, ‘నరసింహ’, ‘జీన్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘బాయ్స్’, ‘7జీ బృందావన్ కాలనీ’, ‘ఎంతవారుకానీ’, ‘ఉల్లాసం’, ‘ఆస్తి మూరెడు- ఆశ బారెడు’ లాంటి సినిమాలకు శివగణేష్ సాహిత్యం అందించారు. శివ గణేశ్ వెయ్యికిపైగా సినిమాలకు పాటలు రాశారు.
కాగా.. శివగణేశ్‌కు భార్య నాగేంద్రమణి, కుమారులు సుహాస్, మానస్ ఉన్నారు. తండ్రి ఇకలేడన్న వార్త తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. శివ ఒక్క తెలుగునే కాకుండా పలు తమిళ సినిమాలకు కూడా ఆయన పనిచేశారు. రచయిత ఇకలేరన్న విషయం తెలుసుకుని ఆయన మృతికి పలువురు తెలుగు, తమిళ సినిమా రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇవాళ సాయంత్రం శివ గణేష్ అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout