టాలీవుడ్డే నెంబర్ వన్: కంగనా
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ క్వీన్, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోనిలిచే నటి ఎవరైనా ఉన్నారా? అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చే పేరు కంగనా రనౌత్. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతితో మరింతగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు బాలీవుడ్‌లో డ్రగ్స్ ఉన్నాయంటూ ఏకంగా మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు కంగనా. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో అతిపెద్ద ఫిలింసిటీ కట్టాలనుకుంటున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన నేపథ్యంలో కంగనా చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.
"మన దేశంలో అందరూ బాలీవుడ్ చిత్ర పరిశ్రమనే పెద్ద పరిశ్రమగా అనుకుంటారు. కానీ అది తప్పు. ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఇప్పుడు నోయిడాలో ఫిలింసిటీ కట్టాలనుకుని ఆదిత్యనాథ్‌గారు తీసుకున్న నిర్ణయం బావుంది. మంచి నిర్ణయం. దీంతో పాటు సినీ పరిశ్రమలో చాలా మార్పులు తీసుకురావాలి. అన్నీ చిత్ర పరిశ్రమలు కలిసి భారతీయ చిత్రపరిశ్రమగా ఏర్పడితే మంచిది. మనం విడిపోవడం వల్ల హాలీవుడ్ లాభపడుతోంది" అని కంగనా రనౌత్ స్పందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments