టాలీవుడ్లో భారీగా రెమ్యునరేషన్ తీసుకునేది ఈ భామలే!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌కు హీరోయిన్లు కొదవలేదని చెప్పుకోవచ్చు.. ఎంతోమంది వస్తుంటారు.. తమ టాలెంట్‌తో ఇండస్ట్రీని ఏలేస్తుంటారు.. మరికొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. అయితే ఎన్నేళ్లయినా కొందరు మాత్రం ఇప్పటికీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తున్నారు. వారిలో యోగా బ్యూటీ అనుష్క, తమిళ ముద్దుగుమ్మ నయనతార.. మొదటి వరుసలో ఉంటారని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా వారు సినిమాల్లోకి ఎంట్రీ నుంచి ఇప్పటి వరకూ ఛాన్స్లకూ కొదువలేదు.. కాసులకూ కొదువలేకుండా పోయింది. అయితే ఎక్కువ మంది ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న వారిలో మైక్రోస్కోప్ పెట్టి వెతికినా తెలుగు భామలు మాత్రం కనపడరు. ఇదీ టాలీవుడ్లో పరిస్థితి. అయితే వేరే ఇండస్ట్రీ నుంచి ఇక్కడ తెలుగులో రాణిస్తూ.. భారీగా రెమ్యునరేషన్ తీసుకునే ముద్దుగుమ్మల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
నంబర్ వన్ స్థానంలో అనుష్క!
‘సూపర్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు అన్ని సూపర్ డూపర్ హిట్లే.. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి తన క్రేజ్‌ను ప్రపంచానికి చాటి చెప్పుకుంది. ఈ ముదురు భామకు 35 ఏళ్లు దాటినప్పటికీ ఏ మాత్రం అందం, అభినయంలో చెక్కు చెదరలేదు.. అలా సినిమాల్లో రాణిస్తూ కుర్ర హీరోయిన్లకు సైతం పోటీనిస్తోంది. ఈ భామ ఒక్కో సినిమాకు సుమారు 3.5 నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. అంతేకాదు త్వరలోనే కోన వెంకట్ సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ పెంచినట్లు వార్తలు వినవస్తున్నాయి. అయితే జేజమ్మ రెమ్యునరేషన్ పెంచినప్పటికీ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మాత్రం క్యూ కడుతూనే ఉన్నారు.
నంబర్ టూగా నయన్!
ఇక నంబర్ టూ విషయానికొస్తే నయనతార. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ ఈ భామకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు.. నాలుగు గోడలకు పరిమితం కావాల్సిన అవసరం అంతకన్నా లేదు.. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఇలా గ్యాప్ లేకుండా సినిమాలతో బిజీబిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో సీనియర్ హీరోల సినిమా అంటే చాలు ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఈ ముద్దుగుమ్మే.. అలా తనకంటూ టాలీవుడ్లో ఓ స్థానాన్ని సంపాదించుకోగలిగింది. కాగా ఈ ముదురు భామపై పెళ్లి, ప్రేమ వ్యవహారాలు తప్ప పెద్దగా వార్తలు వచ్చిన దాఖలాల్లేవ్.. ఇవన్నీ ఇక్కడ అప్రస్తుతం. గనుక అసలు విషయానికొస్తే.. ఈ భామ ఒక్క సినిమాకు సైన్ చేస్తే సుమారు రెండున్నర నుంచి 4 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న ‘సైరా’ సినిమాకు గాను 3 కోట్లకు పైగానే పుచ్చుకుందని సమాచారం.
తర్వాత ఎవరు..!?
సమంత అక్కినేని ఒక్కో సినిమాకు 2 నుంచి 2.5 కోట్లు. పూజా హెగ్దే ఒక్కో సినిమా దాదాపు కోటి 70 నుంచి 2 కోట్ల వరకు.! కాజల్ అగర్వాల్ సినిమాకు కోటిన్నర వరకు చార్జ్ చేస్తుందని సమాచారం. ఇక మిల్క్ బ్యూటీ తమన్నా విషయానికొస్తే.. సినిమాకు కోటి 20 లక్షలు తీసుకుంటుందని టాక్. కైరా అద్వానీ, రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ కూడా సినిమాకు కోటి వరకు తీసుకుంటున్నారట. సాయి పల్లవి సినిమా కోసం కోటి 20 లక్షలు పారితోషికం పుచ్చుకుంటుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com