డ్రగ్స్‌తో పట్టుబడిన తెలుగు హీరో ప్రేయసి.. అరెస్ట్

  • IndiaGlitz, [Monday,January 29 2024]

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. పోలీసులు ఎంత హెచ్చరించినా కొంతమంది వినడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలోనే డ్రగ్స్ అనే మాట వినపడకూడదని పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు. దీంతో నార్కోటిక్ బ్యూరో పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నార్సింగి పరిధిలో ఓ యువతి ఏకంగా డ్రగ్స్‌తో బయటపడింది.

హైదరాబాద్ కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఓ యువతి డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఓటి పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం యువతి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో 4 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. ఓ యువకుడు కూడా ఇంట్లో ఉండంటతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ గోవా నుండి యునిత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా యువతికి చేరినట్లు చెబుతున్నారు.

అయితే ఈ డ్రగ్స్ గోవా నుంచి హైదరాబాద్‌కి ఎలా వచ్చాయి.. ఈ డ్రగ్స్ తరలింపు వెనుక ఉన్న ఎవరున్నారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె దగ్గర మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ పరిశీలించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. పట్టుబడిన యువతి ఓ తెలుగు హీరో ప్రేయసిగా గుర్తించారు. ఆ హీరో కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆమెకు చిత్ర పరిశ్రమలో ఇంకెవరెవరితో సంబంధాలు ఉన్నాయో అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. యువతిని ఉప్పల్ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు.

More News

Koratala Siva: కొరటాల శివకు షాక్.. క్రిమినల్ కేసు ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మరోసారి వార్తల్లో నిలిచారు. 'శ్రీమంతుడు' కథ విషయంలో ఏడేళ్లుగా జరుగుతున్న రచ్చ విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది.

జగన్ సభలు కళకళ.. చంద్రబాబు సభలు వెలవెల..

రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. ఓవైపు పాండవ సైన్యం.. మరోవైపు కౌరవుల సైన్యం మధ్య యుద్ధం జరగనుంది. పాండవుల సైన్యానికి అర్జునుడిలా సీఎం జగన్‌ వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Rajya Sabha:రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. పోలింగ్ తేదీ ఇదే..

లోక్‌సభ ఎన్నికల కంటే ముందు మరో కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది. త్వరలో 15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 56 మంది రాజ్యసభ సభ్యుల

Animal:ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన 'యానిమల్'.. ఉత్తమ నటుడు ఎవరంటే..?

హిందీ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఫిల్మ్‌ఫేర్‌’ (Film Fare awards) అవార్డుల్లో 'యానిమల్' చిత్రం సత్తా చాటింది.

Rashmika:సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉంది.. రష్మిక వ్యాఖ్యలు వైరల్..

రష్మిక మందన్న.. నేషనల్ క్రష్‌గా ఫుల్ పాపులారింటీ దక్కించుకున్నారు. 'పుష్ప' సినిమాతో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా స్థిరపడ్డారు.