ఏపీ ఎన్నికల్లో టాలీవుడ్ హీరోయిన్ పోటీ
Send us your feedback to audioarticles@vaarta.com
'నచ్చావులే' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మాధవీలత రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్న ఆమె 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తానని అధిష్టానానికి తన మనసులోని మాట చెప్పారు. ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలించిన ఏపీ బీజేపీ నేతలు ఎమ్మెల్యేగా పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మాధవికి.. గుంటూరు పశ్చిమ టికెట్‌ను కేటాయించడం జరిగింది. కాగా.. రాజకీయాలకు కేంద్రబిందువైన, ఏపీ రాజధాని ఉన్న గుంటూరు నుంచి ఫస్ట్ టైమ్ తన అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు. కాగా.. గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ తరఫున చంద్రగిరి ఏసురత్నం పోటీ చేస్తుండగా..
టీడీపీ తరఫున మద్దాల గిరి బరిలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండగా.. మాధవి లత నేను సైతం బరిలో అంటూ ఫస్ట్ టైమ్ పోటీ చేస్తు్న్నారు. కాగా.. ఇవాళ్టి నుంచే నామినేషన్ పర్వం మొదలైంది. మరో మూడు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
కాగా.. ఈ నియోజకవర్గం నుంచి ఎప్పుడూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పోటీచేసేవారు. అయితే ఈసారి ఆయన నరసారావుపేట ఎంపీగా పోటీ చేస్తుండగా.. అసెంబ్లీకి మాధవి లత పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మాధవికి ఏ మేరకు ఓట్లు పడతాయో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments