రామ్ చరణ్ మూవీలో విలన్ గా నటిస్తున్న హీరో..?
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. శ్రీను వైట్ల దర్శకత్వంలో దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.దసరా కానుకగా బ్రూస్ లీ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే బ్రూస్ లీ చిత్రం తర్వాత రామ్ చరణ్ తమిళ చిత్రం తని ఒరువన్ రీమేక్ లో నటించనున్నారు. ఈ సినిమాలో చరణ్ పోలీసాఫీర్ గా కనిపిస్తారు.
ఇక అసలు విషయానికి వస్తే...ఈ చిత్రంలో విలన్ రోల్ ను రానాతో చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. రామ్ చరణ్, రానా ఇద్దరు మంచి స్నేహితులు. కనుక రామ్ చరణ్ అడిగితే రానా విలన్ పాత్ర చేసే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే...బాహుబలి తర్వాత రానా విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మరింత క్రేజ్ రావడం ఖాయం. తని ఒరువన్ చిత్ర దర్శకుడు జయం రాజానే తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది.మరి..రామ్ చరణ్ మూవీలో రానా నటిస్తున్నారా..? లేదా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com