Naga Shaurya: కన్నడ అమ్మాయితో నాగశౌర్య పెళ్లి.. పదిరోజుల్లోనే ముహూర్తం, వెడ్డింగ్ కార్డ్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన నాగశౌర్య ఓ ఇంటి వాడు కాబోతున్నారు. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే ఇంటీరియర్ డిజైనర్‌తో ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 11.25 గంటలకు వీరి విహహం జరగనుంది. 19వ తేదీన మెహందీ వేడుకతో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే.. మెహంది, పెళ్లికి వేర్వేరుగా డ్రెస్ కోడ్ పెట్టినట్టు ఇన్విటేషన్ కార్డు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం నాగశౌర్య శుభలేక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాగశౌర్యకు ఫ్యాన్స్ విషెస్:
బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లా లేదంటే ప్రేమ వివాహమా అన్నది మాత్రం తెలియరాలేదు. తమ అభిమాన హీరో ఓ ఇంటి వాడు కాబోతుండటంతో నాగశౌర్య ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
వరుస హిట్లతో స్టార్ రేసులోకి :
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన నాగశౌర్య తర్వాత విజయవాడలో పెరిగారు. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చేసి ప్రయత్నాలు ప్రారంభించారు. అలా క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అయితే ‘‘చందమామ కథలు’’ అనే సినిమా నాగశౌర్యకు మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జాదు గాడు ఇలా వరుస హిట్లతో స్టార్ రేసులోకి దూసుకొచ్చారు. కానీ చలో డిజాస్టర్ కావడంతో పాటు తర్వాత చేసిన కణం, కృష్ణ బృందా విహారిలు నిరాశపరిచాయి. అయినప్పటికీ దిగులు చెందక ఇటీవలే తన 24వ సినిమాను పట్టాలెక్కించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments