విశాఖలో ఏపీ రాజధాని.. టాలీవుడ్‌లో పెరిగిన జోష్

ఏపీ రాజధానుల అంశం పొలిటికల్‌గా ఎలా ఉన్నా.. చిత్ర పరిశ్రమకు మాత్రం మంచి జోష్‌ని ఇస్తోంది. టాలీవుడ్ నుంచి సానుకూల స్పందన వస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి.. రాజధానిగా విశాఖకే తన మద్దతని ప్రకటించడంతో.. ఒక్కసారిగా అందరి దృష్టి అటు పడింది. అభివృద్ధి వికేంద్రీకరణకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు శనివారం ఆయన ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. చిరు ప్రకటన విడుదలయ్యాక పలువురు టాలీవుడ్ ప్రముఖులు అదే బాట పట్టారట.

ఇదిలా ఉంటే.. సినీ పరిశ్రమకు విశాఖ ఎప్పటి నుంచో కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. అరకు లోయ, బొర్రా గుహలు, సముద్రం.. ఇలా ఎంతో ప్రకృతి రమణీయతను సంతరించుకున్న విశాఖలో ఎన్నో సినిమాలు నిర్మితమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు అక్కడ పెద్ద ఎత్తున స్థలాలు కూడా కొనుగోలు చేశారు. స్టూడియోల నిర్మాణానికి కూడా సిద్ధమయ్యారు. అయితే పూర్తిస్థాయిలో అవి కార్యరూపం దాల్చలేదు. సురేశ్ ప్రొడక్షన్ ఓ స్టూడియోను ఇప్పటికే రెడీ చేసింది కూడా. తాజా ప్రకటనతో సినీ పరిశ్రమకు విశాఖ మరింత చేరువకానుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమాల‌కు సంబంధించిన ప‌లు కార్య‌క్ర‌మాలు విశాఖ‌లో కూడా నిర్వ‌హిస్తున్నారు. ఒక‌ప్పుడు విశాఖ‌లో విరివిగా షూటింగ్‌లు జ‌రిగేవి.. ఇప్పుడు వాటి సంఖ్య పెరుగుతుంది. నెమ్మ‌దిగా సినీ ప‌రిశ్ర‌మ వైజాగ్‌లో విస్త‌రిస్తుంది.

More News

ప్రేమ వ్య‌వ‌హారంపై నోరు విప్పిన హీరో.. మ‌తం కూడా మార్చుకున్నాడు

హీరో జై.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా తెలిసిన పేరే. గ‌తంలో ఆయ‌న న‌టించిన త‌మిళ చిత్రం `జ‌ర్నీ`

ప‌రుశురామ్‌కి ఝ‌ల‌క్ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌

ఓ సినిమా పెద్ద హిట్ట‌యితే ఆ ద‌ర్శ‌కుడికి వ‌చ్చే గుర్తింపు వేరుగా ఉంటుంది. స‌ద‌రు ద‌ర్శ‌కుడికి నిర్మాత‌లు అడ్వాన్సులు ఇచ్చి త‌మ బ్యాన‌ర్‌లో సినిమా చేయాలంటూ లాక్ చేసుకుంటారు.

చెప్ప‌క‌నే చెప్పేసిన ద‌ర్శ‌క‌ధీరుడు

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో

పౌరసత్వ బిల్లు: మరణం వస్తే మీకంటే ముందు నేనే..!

భారతదేశంలో ప్రతి ఒక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపీ పిలుపునిచ్చారు.

ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతున్న ఆది సాయికుమార్

హీరో ఆది సాయికుమార్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు . పుట్టిన రోజు సందర్భంగా