ఏపీ వరదలు: ఎట్టకేలకు కదిలిన టాలీవుడ్.. తలో రూ.25 లక్షలు ప్రకటించిన ఎన్టీఆర్, చిరంజీవి, మహేశ్, చెర్రీ
Send us your feedback to audioarticles@vaarta.com
వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ కొద్దిరోజుల క్రితం చివురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. లక్షలాది ఎకరాల్లో పంట నష్టంతో పాటు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సహాయ చర్యలు ప్రారంభించి తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొల్పేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి, వరద బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలిచింది.
జూనియర్ ఎన్టీఆర్ ఏపీలో వరద బాధితులకు రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. రాష్ట్రంలో వరద బాధితుల కడగండ్లు తన మనసును కలచివేసిందని అన్నారు. అందుకే వారికి సాయంగా తన వంతుగా కొద్దిమొత్తం విరాళంగా ఇస్తున్నానని పేర్కొన్నారు. ఆ వెంటనే మహేశ్ బాబు, చిరంజీవి, రామ్‌చరణ్‌లు సైతం తలో రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు వారంతా వేరు వేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు చేశారు.
వీరి స్పూర్తితో టాలీవుడ్ నుంచి మరికొందరు ప్రముఖులు .. వరద బాధితులకు అండగా నిలిచే అవకాశం వుంది. ఈ వరదకు సంబంధించి చిత్ర పరిశ్రమ నుంచి మొట్టమొదట స్పందించింది అల్లు అరవింద్ సారథ్యంలోని గీతా ఆర్ట్స్ సంస్థే. నవంబర్ 24న ఈ సంస్థ తిరుపతిలో వరద బాధితులకు రూ.10 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించింది. అయితే ఆలస్యంగానైనా మిగిలినవారు స్పందించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments