రిటైర్‌మెంట్ ప్రకటిస్తామంటున్న స్టార్ ఫైట్ మాస్టర్స్
- IndiaGlitz, [Wednesday,September 12 2018]
టాలీవుడ్‌లో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు వారు యాక్షన్ సీక్వెలను కంపోజ్ చేస్తున్నారు. అయితే వీరు త్వరలోనే సినిమాల నుండి రిటైర్‌మెంట్ తీసుకుంటామని అంటున్నారు.
సినిమాల్లో భారీ పైట్స్‌ను కంపోజ్ చేసే ఈ అన్నదమ్ములు నిజ జీవితంలో అందుకు భిన్నంగా ఉంటారు. ధ్యానానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. పేదలకు సహాయం చేస్తుంటారు. మంచి పనులతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న వీరు ఇప్పటి వరకు 1000 సినిమాలకు పైగా వర్క్ చేశారు. నంది అవార్డును కూడా అందుకున్నారు.
నిన్న మండటపేటలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఈ అన్నదమ్ములు త్వరలోనే సినిమా నుండి రిటైర్‌మెంట్ తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇంత బిజీగా ఉన్న టైమ్‌లోనే వారు రిటైర్‌మెంట్ తీసుకోవాలనుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.