బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ డైరెక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ డైరెక్టర్..ఎవరో కాదు అభిరుచి గల దర్శకుడు శేఖర్ కమ్ముల. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హ్యాపీడేస్ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని..ఎప్పటి నుంచో అనుకుంటున్నారు శేఖర్ కమ్ముల. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. అనామిక తర్వాత ఖచ్చితంగా హ్యాపీడేస్ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇంతలో శేఖర్ కమ్ముల..మహేష్ తో మూవీ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో...ఇప్పుడు హ్యాపీ డేస్ రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాడట శేఖర్ కమ్ముల. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం. శేఖర్ కపూర్ - సల్మాన్ ఖాన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారట. ఈ సినిమాలో ఎంతో ముఖ్యమైన కాలేజ్ కోసం పూణేలోని ఇంజనీరింగ్ కాలేజ్ ని సెలెక్ట్ చేసారట. మరి...టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన శేఖర్ కమ్ముల బాలీవుడ్ లో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com