టాలీవుడ్లో మరో విషాదం.. కరెంట్ షాక్తో యువ దర్శకుడు దుర్మరణం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఘట్టమనేని రమేష్ బాబు, నారాయణ దాస్ నారంగ్, సీనియర్ నటుడు బాలయ్య తదితరులు మృతిచెందారు. వీటి నుంచి కోలుకోకముందే తాజాగా యువ దర్శకుడు పైడి రమేష్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పైడి రమేష్ నాలుగో అంతస్తులో ఆరేసిన బట్టలు తీస్తుండగా కరెంట్ షాక్ కొట్టి.. భవనంపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా... పైడి రమేష్ గతంలో 'రూల్' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. 2018లో విడుదలైన ఈ సినిమా అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. ప్రస్తుతం మరో సినిమాను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతలోనే రమేష్ కానరాని లోకాలకు తరలిపోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు కంటతడి పెడుతున్నారు.
మరోవైపు.. నిన్న హీరో నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో నిఖిల్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సిద్ధార్ధ్ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com