టాలీవుడ్‌లో మరో విషాదం.. కరెంట్ షాక్‌తో యువ దర్శకుడు దుర్మరణం

  • IndiaGlitz, [Friday,April 29 2022]

తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఘట్టమనేని రమేష్ బాబు, నారాయణ దాస్ నారంగ్, సీనియర్ నటుడు బాలయ్య తదితరులు మృతిచెందారు. వీటి నుంచి కోలుకోకముందే తాజాగా యువ దర్శకుడు పైడి రమేష్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పైడి రమేష్ నాలుగో అంతస్తులో ఆరేసిన బట్టలు తీస్తుండగా కరెంట్ షాక్ కొట్టి.. భవనంపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాగా... పైడి రమేష్ గతంలో 'రూల్‌' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. 2018లో విడుదలైన ఈ సినిమా అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. ప్రస్తుతం మరో సినిమాను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతలోనే రమేష్ కానరాని లోకాలకు తరలిపోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు కంటతడి పెడుతున్నారు.

మరోవైపు.. నిన్న హీరో నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో నిఖిల్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సిద్ధార్ధ్ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

More News

ఎన్టీఆర్ 30 నుంచి ఆలియా అవుట్... ఛాన్స్ కోసం ఇద్దరు పాన్ ఇండియా హీరోయిన్స్ పోటీ

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

‘‘ఆచార్య’’లో మరో సర్‌ప్రైజ్ : గెస్ట్‌ రోల్‌లో సత్యదేవ్.. ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ చిరు ట్వీట్

కృషి , పట్టుదల, శ్రమించేతత్వం వుంటే ఏ గాడ్ ఫాదర్ లేకపోయినా అత్యున్నత శిఖరాలను

వడ్డీ వ్యాపారం కాదు.. పాలన సంగతి చూడండి : జగన్‌పై నాదెండ్ల మనోహర్ సెటైర్లు

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

BRS పేరుతో కొత్త జాతీయ పార్టీ.. ప్లీనరీలో కేసీఆర్ సంకేతాలు

జాతీయ రాజకీయాల్లో ఎలాగైనా చక్రం తిప్పాలని భావిస్తోన్న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ప్రజల దృష్టి మరల్చేందుకే పవన్‌పై విమర్శలు.. టైం చూసి గట్టిగా ఇస్తాం : మంత్రులకు నాగబాబు వార్నింగ్

శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీస్ వ్యవస్థను వై.సీ.పీ. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు