సూర్య సినిమాలో బాలీవుడ్ భామ..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో సూర్య విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో 24, హరి డైరెక్షన్ లో సింగం 3 సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్...డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్ధ స్టూడియో గ్రీన్ నిర్మిస్తుంది. తెలుగు, తమిళ్ లో ఈ చిత్రాన్ని భారీ స్ధాయిలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.
తివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం నితిన్ తో అ..ఆ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరికి షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అ...ఆ రిలీజ్ తర్వాత నుంచి త్రివిక్రమ్ సూర్య సినిమా వర్క్ స్టార్ట్ చేస్తారట. ఈ సినిమా హీరోయిన్ విషయంలో బాలీవుడ్ భామ దీపికా పడుకునే నటిస్తే...ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ వస్తుందని ఆలోచిస్తున్నారని సమాచారం. త్వరలోనే దీపికాను సంప్రదిస్తారట. మరి..దీపికా ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ రావడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com