జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ: బెజవాడ చేరుకున్న చిరంజీవి, మహేశ్, ప్రభాస్.. నాగ్, ఎన్టీఆర్ మిస్

సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్‌తో చర్చించేందుకు గాను టాలీవుడ్ ప్రముఖుల బృందం విజయవాడ చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ , పోసాని కృష్ణ మురళి, ఆర్ నారాయణ మూర్తి వంటి సినీ ప్రముఖులు జగన్‌తో భేటీ కానున్నారు. అయితే ఈ భేటీకి నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ దూరంగా వుంటున్నట్లుగా సమాచారం.

అంతకుముందు  సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రమ్మని ఏపీ సీఎంఓ నుంచి తనకి ఆహ్వానం అందిందని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. గురువారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యేందుకు ప్రత్యేక విమానంలో ఆయన అమరావతికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎంఓ నుంచి నాకు మాత్రమే ఆహ్వానం అందిందని నాకు తెలిసింది. నాతోపాటు ఎవరు వస్తున్నారో నాకు తెలీదు. మీడియాలో వస్తోన్న కథనాలు చూసిన తర్వాతనే మిగతా విషయాలు తెలిశాయి. సీఎంను కలిసిన తర్వాత మాట్లాడతా. ఈ రోజు సమస్యలకు శుభం కార్డు పడుతుందని ఆశిస్తున్నా’’ అని చిరు వ్యాఖ్యానించారు.  

అంతకుముందు విజయవాడ వెళుతూ... బేగంపేట ఎయిర్‌పోర్టులో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రమ్మని ఏపీ సీఎంఓ నుంచి తనకి మాత్రమే ఆహ్వానం అందిందని మెగాస్టార్ అన్నారు. తనతోపాటు ఎవరు వస్తున్నారో తెలియదని... మీడియాలో వస్తోన్న కథనాలు చూసిన తర్వాతనే మిగతా విషయాలు తెలిశాయని చిరంజీవి పేర్కొన్నారు. సీఎంను కలిసిన తర్వాత మిగిలిన విషయాలు వెల్లడిస్తానని చిరు చెప్పారు. ఈ రోజు సమస్యలకు శుభం కార్డు పడుతుందని ఆయన ఆకాంక్షించారు. అలాగే అల్లు అరవింద్ మాట్లాడుతూ... సినీ పరిశ్రమకు సంబంధించి అన్ని సమస్యలకు నేటితో ఎండ్ కార్డ్ పడుతుందని అన్నారు. టాలీవుడ్‌కి మేలు జరిగేలా ప్రకటన వస్తుందని భావిస్తున్నానని.. తమ కుటుంబం నుంచి చిరు వెళ్లారని, అందువల్ల తాను వెళ్లాల్సిన అవసరం లేదని అల్లు అరవింద్ చెప్పారు.