మహేష్ భావోద్వేగం.. గ్రేట్ లాస్ అంటున్న చిరు, ఎన్టీఆర్

ప్రముఖ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు ఆకస్మిక మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. సీనియర్ హీరోల నుంచి నేటి తరం యంగ్ హీరోల వరకు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో టాలీవుడ్ సెలెబ్రిటీలు బీఏ రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం తెలియజేస్తున్నారు.

బీఏ రాజు మృతి పట్ల మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. మహేష్ తో బీఏ రాజు చాలా క్లోజ్ గా అసోసియేట్ అయ్యేవారు. ' ఆయన మరణ వార్తని జీర్ణించుకోలేకున్నా. నా చిన్ననాటి నుంచి ఆయన తెలుసు. చాలా ఏళ్ల నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం. క్లోజ్ గా పనిచేశాం. ఆయన జెంటిల్ మాన్, సినిమా పట్ల ఫ్యాషన్ ఉన్న వ్యక్తి. మా కుటుంబం అంటే ఎంతో అభిమానం. బీఏ రాజుగారి ఆత్మకు శాంతి చేకూరాలి.' అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

బీఏ రాజు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి షాక్ కి గురయ్యారు. బీఏ రాజు అంటే సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరని అన్నారు. సినిమాకు సంబంధించి ఆయనొక ఎన్ సైక్లోపీడియా. దశాబ్దాల క్రితం చిత్రాల విడుదల తేదీలు, రికార్డులని ఆయన ఖచ్చితంగా చెప్పగలరు. నేను నటించిన ఎన్నో చిత్రాలకు ఆయన పీఆర్వోగా పనిచేశారు. ఆయన ఇక లేడన్న వార్త విని షాకయ్యాను. బీఏ రాజు ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి అని చిరంజీవి సంతాపం తెలిపారు.

నా కెరీర్ ఆరంభం నుంచి బీఏ రాజు గారు తెలుసు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన సీనియర్ జర్నలిస్ట్. టాలీవుడ్ కు చాలా గొప్ప సేవ అందించారు. బీఏ రాజు గారి మరణ వార్త నన్ను షాక్ కి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

నేను పూర్తిగా షాక్ లో ఉన్నా. ఆయనతో రెండు రోజుల క్రితమే మాట్లాడా. నా కెరీర్ ఆరంభం నుంచి ఆయన సపోర్ట్ ఎంతో ఉంది. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం బీఏ రాజుగారు. రెస్ట్ ఇన్ పీస్ అంటూ రాక్ స్టార్ దేవిశ్రీ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

టాలీవుడ్ యంగ్ హీరోలు, నిర్మాతలు, పీఆర్వోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు బీఏ రాజు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

More News

నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ గుండెపోటుతో మృతి

విశాఖపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియన్‌గా పనిచేస్తూ ఆయన సస్పెండైన విషయం తెలిసిందే.

విషాదం : నిర్మాత బీఏ రాజు మృతి

టాలీవుడ్ లో మరో దుర్ఘటన జరిగింది. ప్రముఖ నిర్మాత, పిఆర్వో బీ ఏ రాజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ ఈ ఉదయం మెల్కోవలసి వచ్చింది.

నాని 'శ్యామ్ సింగ రాయ్'కి భారీ నష్టం.. ఎంత పని జరిగింది!

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ భారీ నష్టాలు ఎదుర్కొంటోంది. కోట్లాది రూపాలు ఖర్చు చేసి నిర్మించిన చిత్రాలు విడుదలకు నోచుకోకుండా పోయాయి.

వీధుల్లో తిరుగుతున్న సూపర్ స్టార్.. ట్రెండింగ్ లో ఫొటోస్

సూపర్ స్టార్ రజనీకాంత్ సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం. అనేక సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయింది. వీలైనంతగా హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం

ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్ కీలక నిర్ణయం..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఔషధంపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు.