వై.ఎస్.జగన్‌తో ముగిసిన సినీ పెద్దల బేటీ... విశేషాలు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా షూటింగ్స్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ను కలిసిన సినీ ప్రముఖులు చిరంజీవి, అక్కినేని నాగార్జున, డి.సురేష్‌బాబు, దిల్‌రాజు, ఎస్.ఎస్.రాజమౌళి, సి.కల్యాణ్, దామోదర్ ప్రసాద్ కలిశారు. చర్చల అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు.
షూటింగ్స్ అనుమతి:
ప్రభుత్వం చెప్పిన విధి విధానాలను పాటిస్తూ ఈ నెల 15 నుండి ఏపీలో షూటింగ్స్ జరుపుకోవచ్చు
300 ఎకరాల కేటాయింపులు:
వై.ఎస్.ఆర్ హయాంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం వైజాగ్‌లో 300 ఎకరాల భూమిని కేటాయించారు. వాటి గురించి ప్రస్తావించగా ఎవరైనా ఇక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి, సినీ పరిశ్రమను ఎవరైనా రెప్రరెంజ్ చేస్తూ ఇక్కడే ఉందామంటే వారికి ఆ 300 ఎకరాల్లో భూమిని కేటాయించడానిక జగన్ ఒప్పుకున్నారు.
నంది అవార్డులు:
పాత నంది అవార్డులను కాకుండా 2019-20 సంవత్సరం నుండి ఇవ్వడానికి జగన్ సుముఖతను వ్యక్తం చేశారు.
టికెట్ రేట్స్, ఆన్ లైన్ టికెటింగ్:
సినిమా స్టార్స్, సీజన్‌ను బట్టి సినిమా టికెట్ రేట్స్‌ను పెంచుకోవడానికి కావాల్సిన అనుమతులను పరిశీలిస్తామని తెలిపారు. అలాగే ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తే టికెటింగ్ విషయంలో జరిగే మోసాలను తగ్గించవచ్చు అని రిక్వెస్ట్ చేస్తే ఆ అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపారు.
థియేటర్ పవర్ బిల్స్:
రన్ కానీ థియేటర్స్ విషయంలో వచ్చే కరెంట్ బిల్లులకు సబ్సిడీ ఇవ్వాలని కోరగా పరిశీలిస్తామని తెలిపారు.
సబ్సిడీలు:
చిన్న సినిమాలకు ఎప్పటి నుండో ప్రభుత్వం నుండి రావాల్సిన సబ్సిడీలు ఇంకా రాలేదు. వాటిని కూడా వచ్చేలా చూడాలని చెప్పడంతో వాటిని కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఇంకా తదుపరి విషయాలపై వచ్చే జూలై 15న చర్చ జరుగుతుందని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout