వై.ఎస్‌.జ‌గ‌న్‌తో ముగిసిన సినీ పెద్ద‌ల బేటీ... విశేషాలు

సినిమా షూటింగ్స్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చినందుకు ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌ను క‌లిసిన సినీ ప్ర‌ముఖులు చిరంజీవి, అక్కినేని నాగార్జున‌, డి.సురేష్‌బాబు, దిల్‌రాజు, ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, సి.క‌ల్యాణ్‌, దామోద‌ర్ ప్ర‌సాద్ క‌లిశారు. చ‌ర్చ‌ల అనంత‌రం చిరంజీవి మీడియాతో మాట్లాడారు.

షూటింగ్స్ అనుమ‌తి:

ప్ర‌భుత్వం చెప్పిన విధి విధానాల‌ను పాటిస్తూ ఈ నెల 15 నుండి ఏపీలో షూటింగ్స్ జ‌రుపుకోవ‌చ్చు

300 ఎక‌రాల కేటాయింపులు:

వై.ఎస్‌.ఆర్ హ‌యాంలో సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి కోసం వైజాగ్‌లో 300 ఎక‌రాల భూమిని కేటాయించారు. వాటి గురించి ప్ర‌స్తావించ‌గా ఎవ‌రైనా ఇక్క‌డ స్టూడియోలు క‌ట్టుకోవ‌డానికి, సినీ పరిశ్ర‌మ‌ను ఎవరైనా రెప్ర‌రెంజ్ చేస్తూ ఇక్క‌డే ఉందామంటే వారికి ఆ 300 ఎక‌రాల్లో భూమిని కేటాయించ‌డానిక జ‌గ‌న్ ఒప్పుకున్నారు.

నంది అవార్డులు:

పాత నంది అవార్డుల‌ను కాకుండా 2019-20 సంవత్స‌రం నుండి ఇవ్వ‌డానికి జ‌గ‌న్ సుముఖ‌త‌ను వ్య‌క్తం చేశారు.

టికెట్ రేట్స్‌, ఆన్ లైన్ టికెటింగ్‌:

సినిమా స్టార్స్‌, సీజ‌న్‌ను బ‌ట్టి సినిమా టికెట్ రేట్స్‌ను పెంచుకోవ‌డానికి కావాల్సిన అనుమ‌తుల‌ను ప‌రిశీలిస్తామ‌ని తెలిపారు. అలాగే ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తే టికెటింగ్ విష‌యంలో జ‌రిగే మోసాల‌ను త‌గ్గించ‌వచ్చు అని రిక్వెస్ట్ చేస్తే ఆ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలిస్తామ‌ని తెలిపారు.

థియేట‌ర్ ప‌వ‌ర్ బిల్స్‌:

ర‌న్ కానీ థియేట‌ర్స్ విష‌యంలో వ‌చ్చే క‌రెంట్ బిల్లుల‌కు స‌బ్సిడీ ఇవ్వాల‌ని కోర‌గా ప‌రిశీలిస్తామ‌ని తెలిపారు.

స‌బ్సిడీలు:

చిన్న సినిమాల‌కు ఎప్ప‌టి నుండో ప్ర‌భుత్వం నుండి రావాల్సిన స‌బ్సిడీలు ఇంకా రాలేదు. వాటిని కూడా వ‌చ్చేలా చూడాల‌ని చెప్ప‌డంతో వాటిని కూడా ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. ఇంకా త‌దుప‌రి విష‌యాల‌పై వ‌చ్చే జూలై 15న చ‌ర్చ జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

More News

స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌డానికి ఇబ్బందేమీ లేదు:  త‌మ‌న్నా

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మైంది.

హార్ట్ ఆపరేషన్ జరిగింది.. నేను క్షేమమే! : శశి ప్రీతమ్

సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఈ నెల 4న ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ రోజు (మంగళవారం) డిశ్చార్చ్ అవుతున్నారు.

రేవంత్ రెడ్డి వ్యవహారం : ఇది నా తప్పే సరిచేసుకుంటా!

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు గుప్పించారని సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ చానెల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఏపీ-తెలంగాణల మధ్య చెక్ పోస్టులు ఎత్తేయలేదు..!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0 విధించిన విషయం విదితమే. ఇందులో భాగంగా అంతర్ రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి.

హీరోల్లారా.. జగన్‌రెడ్డికి మీరూ ఒక్క మాట చెప్పండి!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్న విషయం తెలిసిందే.