రాజధాని మార్పుతో లబోదిబోమంటున్న టాలీవుడ్ పెద్ద హీరో!
Send us your feedback to audioarticles@vaarta.com
అమరావతి.. ఏపీ రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. నిత్యం నిర్మాణాలతో.. వాటి సరంజామాతో హడావుడిగా కనిపించేది. అమాత్యుల నుంచి అధికారుల వరకు.. వీఐపీల నుంచి సామాన్యుడి వరకు కోలాహలంగా ఉండేది. ఎప్పుడైతే జగన్ సర్కార్ వచ్చిందో.. అప్పటి నుంచి అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మూడు రాజధానులను ప్రతిపాదించిన తర్వాత అక్కడ సీన్ మొత్తం మరోలా తయారైంది. భూములు ఇచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. ఎప్పుడు ఏం జరగనుందోనన్న భయంతో రోడ్డెక్కి పోరు సల్పుతున్నారు.
ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతం అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత సీబీఎన్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని.. దగ్గరి వాళ్లతో భూముల కొనుగోళ్లు జరిపించిందని నేటి వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. వీటన్నింటినీ పక్కన పెడితే.. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారన్నది ఇంకో పెద్ద ఆరోపణ. టాలీవుడ్‌కు చెందిన ఓ పెద్ద హీరో.. 500 ఎకరాలు కొన్నాడని.. బంధువుల, మిత్రులతో కొనుగోలు చేయించాడని తెలుస్తోంది. ప్రస్తుతం రాజధానిపై జగన్ సర్కార్ తీసుకున్న సరికొత్త టర్న్‌తో ఆ హీరోగారు లబోదిబోమంటున్నారట. కోట్లలో విలువ చేసిన భూమి కాస్తా.. లక్షల్లోకి పడిపోయిందని.. దానిపై పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యిందని సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com