సెకండాఫ్‌లో భారీ బడ్జెట్ చిత్రాల హవా తక్కువేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది ప్రథమార్థంలో స్టార్ హీరోల సినిమాల హవా బాగానే కనిపించింది. ఎంతలా అంటే.. నెలకో స్టార్ హీరో సినిమా అయినా తెరపై సందడి చేసింది. ఫలితాల సంగతి పక్కన పెడితే.. జనవరిలో పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', బాలకృష్ణ 'జై సింహా' విడుదల కాగా.. ఫిబ్రవరిలో రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక మార్చి నెలలో రామ్ చరణ్ 'రంగస్థలం' సందడి చేయగా.. ఏప్రిల్ నెలలో మహేష్ బాబు 'భరత్ అనే నేను' రిలీజ్ అయ్యింది.
ఇక మే నెలలో అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', రవితేజ 'నేల టిక్కెట్టు' తెర పైకి రాగా.. జూన్ నెలలో నాగార్జున హీరోగా 'ఆఫీసర్' విడుదలైంది. అంటే.. 6 నెలల్లో 7గురు పెద్ద హీరోల నుంచి 8 భారీ చిత్రాలు వచ్చాయన్నమాట.
ఇక ద్వితీయార్థం విషయానికొస్తే.. రాబోయే ఆరు నెలల్లో కేవలం మూడు అగ్ర హీరోల చిత్రాలు మాత్రమే రాబోతున్నాయి.సెప్టెంబర్‌లో నాగార్జున నటిస్తున్న మల్టీస్టారర్ విడుదల కాగా.. అక్టోబర్‌లో ఎన్టీఆర్ నటిస్తున్న 'అరవింద సమేత వీర రాఘవ', రవితేజ నటిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' రిలీజ్ కానున్నాయి. మొత్తానికి.. ఈ సెకండాఫ్‌లో భారీ బడ్జెట్ చిత్రాల హవా తక్కువేనని చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments