సెకండాఫ్‌లో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ హ‌వా త‌క్కువేనా?

  • IndiaGlitz, [Tuesday,June 26 2018]

ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో స్టార్ హీరోల సినిమాల హ‌వా బాగానే క‌నిపించింది. ఎంత‌లా అంటే.. నెల‌కో స్టార్ హీరో సినిమా అయినా తెర‌పై సంద‌డి చేసింది. ఫ‌లితాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. జ‌న‌వ‌రిలో పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', బాల‌కృష్ణ‌ 'జై సింహా' విడుద‌ల కాగా.. ఫిబ్ర‌వ‌రిలో రవితేజ న‌టించిన‌ 'టచ్ చేసి చూడు' ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇక మార్చి నెల‌లో రామ్ చరణ్ 'రంగస్థలం' సంద‌డి చేయ‌గా.. ఏప్రిల్ నెల‌లో మహేష్ బాబు 'భరత్ అనే నేను' రిలీజ్ అయ్యింది.

ఇక మే నెల‌లో అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', రవితేజ 'నేల టిక్కెట్టు' తెర‌ పైకి రాగా.. జూన్ నెల‌లో నాగార్జున హీరోగా 'ఆఫీసర్' విడుద‌లైంది. అంటే.. 6 నెల‌ల్లో 7గురు పెద్ద హీరోల నుంచి 8 భారీ చిత్రాలు వ‌చ్చాయ‌న్న‌మాట‌.

ఇక ద్వితీయార్థం విషయానికొస్తే.. రాబోయే ఆరు నెల‌ల్లో కేవ‌లం మూడు అగ్ర హీరోల చిత్రాలు మాత్ర‌మే రాబోతున్నాయి.సెప్టెంబ‌ర్‌లో నాగార్జున న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ విడుద‌ల కాగా.. అక్టోబ‌ర్‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్న‌ 'అరవింద సమేత వీర రాఘవ', రవితేజ న‌టిస్తున్న‌ 'అమర్ అక్బర్ ఆంటోనీ' రిలీజ్ కానున్నాయి. మొత్తానికి.. ఈ సెకండాఫ్‌లో భారీ బ‌డ్జెట్ చిత్రాల హ‌వా త‌క్కువేన‌ని చెప్పాలి.

More News

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో చైతు, మోహ‌న్‌బాబు?

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'కి స‌ర్వం స‌న్న‌ద్ధం అవుతుంది.

కాకినాడలో రామ్ చిత్రం షూటింగ్

'సినిమా చూపిస్త మావ‌', 'నేను లోకల్' చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు  అందుకున్నారు దర్శకుడు త్రినాథ‌రావు నక్కిన.

పెళ్ళైన మగాళ్ల కష్టాలను అందరికీ తెలిజయజెప్పేలా 'ఐపిసి సెక్షన్ భార్య బంధు'.

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు'.

'సవ్యసాచి' టీజర్ ఎప్పుడంటే..

యువ క‌థానాయ‌కుడు నాగచైతన్య హీరోగా యంగ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సవ్యసాచి'.

చిరు సరసన రజనీ హీరోయిన్?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.