కొరియన్ యాక్షన్ మాస్టర్స్ ఆధ్వర్యంలో టాలీవుడ్ ముద్దుగుమ్మలు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం మన మూవీ మేకర్స్ కొత్త కాన్సెప్ట్ సినిమాలను నిర్మించడానికి ఆసక్తి చూపించడమే కాదు.. మంచి కాన్సెప్ట్ సినిమాలను ఇతర భాషల నుండి రీమేక్‌లు కూడా చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా మన మేకర్స్ కొరియన్ సినిమాలను రీమేక్‌లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది సమంత అక్కినేని నటించి `ఓ బేబీ` చిత్రం `మిస్ గ్రానీ` అనే కొరియన్ మూవీకి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా 2017లో విడుదలైన మిడ్‌నైట్ రన్నర్స్ అనే కొరియన్ మూవీని రీమేక్ చేయడానికి మన దర్శక నిర్మాతలు సన్నద్ధాలు చేసుకుంటున్నారు. అలాంటి ప్రయత్నం చేస్తున్న నిర్మాత ఎవరో కాదు.. అగ్ర నిర్మాతల్లో ఒకరైన డి.సురేశ్‌బాబు. ఈయన ఇప్పటికే రైట్స్ కొనేసి రీమేక్‌లకు రంగం సిద్ధం చేసేస్తున్నారని కూడా వార్తలు వినపడుతున్నాయి.
`మిడ్ నైట్ రన్నర్స్` సినిమాలో ఇద్దరు హీరోలు పోలీస్ ట్రైనింగ్ ఉంటారు.. ఓ అర్థరాత్రి వాళ్లు అనుకోకుండా విలన్స్ వెంట ఎలా పడతారనేదే కథ. అయితే తెలుగులో పూర్తిగా మారుస్తున్నారట. హీరోల స్థానంలో హీరోయిన్స్‌ను చూపించబోతున్నారట. 'ఎవరు' లాంటి థ్రిల్లర్ తో ఆకట్టుకుంది రెజీనా. నివేదా కూడా గ్లామర్ రోల్స్ కంటే పర్ఫామెన్స్ కు స్కోప్ ఉండే క్యారెక్టర్సే ఎక్కువగా చేస్తోంది. వీరిద్దర్నీ ఒకే సినిమాలో చూపించబోతున్నారు నిర్మాత సురేశ్ బాబు. ఆయన రీమేక్ చేయబోయే కొరియన్ మూవీ 'మిడ్ నైట్ రన్నర్స్'లో రెజీనా, నివేదా స్టన్నింగ్ స్టంట్స్ చేయబోతున్నారట. అందుకోసం ఒరిజినల్ కొరియన్ వర్షన్ కి పని చేసిన ఫైట్ మాస్టర్స్ నే ఇక్కడికి తీసుకొస్తున్నట్టు సమాచారం. వారి శిక్షణలో బ్యూటీస్ ఇద్దరూ కొన్ని నెలల పాటూ కఠినమైన ఎక్సర్‌సైజులు, కిక్స్ అండ్ పంచెస్ ప్రాక్టీస్ చేస్తారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com