టాలీవుడ్ & కోలీవుడ్ క్వీన్..

  • IndiaGlitz, [Tuesday,June 28 2016]

బాలీవుడ్ లో కంగ‌నా న‌టించిన క్వీన్ చిత్రం విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిసౌత్ లో రీమేక్ చేయాల‌ని చాలా మంది నిర్మాత‌లు ప్ర‌య‌త్నించారు. అయితే... ఫైన‌ల్ గా త‌మిళ హీరో ప్ర‌శాంత్ ఫాద‌ర్ త్యాగ‌రాజ‌న్ రీమేక్ హ‌క్కులు సొంతం చేసుకున్నారు. క్వీన్ రీమేక్ హ‌క్కులు ద‌క్కించుకుని చాలా రోజ‌లు అయ్యింది కానీ..క్వీన్ రీమేక్ ఎవ‌రితో చేస్తున్నార‌నే విష‌యం పై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. అయితే... క్వీన్ రీమేక్ సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే...ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు సుహాసిని రాస్తుంటే...ఈ చిత్రాన్ని రేవ‌తి డైరెక్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. తెలుగు, త‌మిళ్ లో రూపొందే ఈ చిత్రంలో క్వీన్ గా త్రిష న‌టిస్తుంద‌ట‌. ఈ క్రేజీ మూవీలో ప్ర‌శాంత్ స్పెష‌ల్ రోల్ క‌నిపించ‌నున్నారట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి వివ‌రాన‌లు అఫిషియ‌ల్ ఎనౌన్స్ చేయ‌నున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే...క్వీన్ క్రేజి మూవీగా మారడం ఖాయం.