మోస్ట్ డేంజరస్ వుమెన్ అంటూ మెహ్రీన్ కామెంట్స్.. వైరల్!

  • IndiaGlitz, [Saturday,July 10 2021]

అందాల తార మెహ్రీన్ కౌర్ ఇటీవల తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. అయితే ఈ ఏడాది మెహ్రీన్ వివాహబంధంలోకి అడుగుపెట్టాలనుకుంది.

ఇదీ చదవండి: బాహుబలి 2, అవెంజర్స్ రికార్డ్ బ్రేక్.. ఫస్ట్ లుక్ రాకముందే సంచలనం

ఈ ఏడాది మార్చిలో హరియాణ మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ నిచ్చితార్ధం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. త్వరలో పెళ్లి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తాను, బిష్ణోయ్ విభేదాలతో విడిపోతున్నట్లు మెహ్రీన్ సంచలన ప్రకటన చేసింది.

ఇకపై తాను తన చిత్రాలతో బిజీ కావాలని కోరుకుంటున్నట్లు, వర్క్ పై ఫోకస్ పెడతానని కూడా ప్రకటించింది. తన వ్యక్తిగత విషయం గురించి చర్చ చేయవద్దని అభిమానులని కోరింది. భవ్య బిష్ణోయ్, తన నిశ్చితార్థానికి సంబంధించిన అన్ని పిక్స్ ని మెహ్రీన్ సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది.

ఇదిలా ఉండగా మెహ్రీన్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 'మోస్ట్ డేంజరస్ వుమెన్ తనని తాను రక్షించుకోవడానికి వేరే వాళ్ళ కత్తిపై ఆధారపడడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమెకే సొంతంగా ఓ కత్తి ఉంటుంది' అంటూ మెహ్రీన్ పరోక్ష వ్యాఖ్యలు చేసింది. ఈ పోస్ట్ తో పాటు కళ్ళు జిగేల్ మనే అందంతో బ్లాక్ డ్రెస్ పిక్ కూడా షేర్ చేసింది.

మెహ్రీన్ తన పర్సనల్ లైఫ్ లో రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ గురించే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందా అనే చర్చ జరుగుతోంది. మెహ్రీన్ ఖాతాలో కృష్ణగాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2  హిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది.