శ్రీకాంత్ కూతురిని చూశారా.. ఆ అందం ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో వున్న విలక్షణ నటుల్లో శ్రీకాంత్ ఒకరు. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పించారు. లవ్, రోమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, జానపదం, పౌరాణికం, క్రైమ్ ఇలా అన్ని జోనర్లలో నటించిన అరుదైన నటుల్లో ఒకరిగా శ్రీకాంత్ ఘనత వహంచారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీకాంత్ తెలుగులో ఈ తరం నటుల్లో 100 సినిమాలు పూర్తి చేసిన వ్యక్తిగా నిలిచారు. వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, కన్యాదానం, మా నాన్నకి పెళ్లి, ప్రయేసి రావి, పెళ్లి సందడి, ఖడ్గం వంటి సినిమాలు ఆయన నటనకు తార్కాణం. కెరీర్లో ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుని నేటికీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు శ్రీకాంత్.
నట వారసుడిగా రోషన్‌ను పరిచయం చేసిన శ్రీకాంత్ :
తన కో స్టార్ ఊహను ప్రేమ వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు శ్రీకాంత్. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారు రోషన్, మేధ, రోహన్. పెద్దబ్బాయి రోషన్‌ను తన నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయం చేశారు. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు రోషన్. త్వరలో మరిన్ని సినిమాల్లో ఆయన నటించనున్నారు.
ఫ్యామిలీ ఫంక్షన్లో తళుక్కుమన్న మేధ:
అమ్మాయి మేథ ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుకుంటోంది. త్వరలోనే ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైట్ స్కిన్ టోన్‌తో పాలరాతి శిల్పంలా వుంది మేధ. ఇప్పుడొచ్చే హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం ఈమె సొంతం. ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో శ్రీకాంత్ కుటుంబం మొత్తం సందడి చేసింది. వీరిలో మేధ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గోల్డ్ కలర్ చీరలో బంగారు వర్ణంలో మెరిసిపోతోంది మేధ. మరి శ్రీకాంత్ ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా లేక మరిన్ని ఉన్నత చదువులు చదివిస్తారా అన్నది తెలియాల్సి వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com