కోలీవుడ్‌కు గ్రీన్ సిగ్నల్.. టాలీవుడ్‌కు ఎప్పుడో..!?
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ చిత్ర సీమకు పళనిస్వామి సర్కార్ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు, రిలీజ్లు, ఫంక్షన్స్ సర్వం బంద్ అయ్యాయి. అయితే.. ఈ దెబ్బ సినీ ఇండస్ట్రీపై పెద్ద ఎత్తునే పడింది. ఇప్పటికే సుమారు నెలన్నరకు పైగా షూటింగ్స్లేక.. సినిమా అయిపోయినవి రిలీజ్ చేసుకోవడానికి దర్శకనిర్మాతలు నానా తంటాలు పడుతున్నారు. ఈ తరుణంలో తమిళనాడు సర్కార్‌కు నిర్మాతలు పలు విజ్ఞప్తులు చేశారు. వీటన్నింటినీ నిశితంగా పరిశీలించిన ప్రభుత్వం ఈ నెల 11 నుంచి టీవీ, సినిమాలకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చంటూ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేయడం మంచి పరిణామమే. అయితే.. ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరని స్పష్టం చేసింది.
ఇలా చేయాలి..!?
- గరిష్ఠంగా ఐదుగురితోనే ఎడిటింగ్
- డబ్బింగ్, డీఐ, రీ రికార్డింగ్ సౌండ్ డిజైన్ /మిక్సింగ్ పనులు చేసుకోవచ్చు
- వీఎఫ్ఎక్స్/సీజీఐ పనుల కోసం గరిష్టంగా 15 మందిని ఉపయోగించుకోవచ్చు
- మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిని విధిగా పాటించాలని కండిషన్స్ పెట్టింది.
టాలీవుడ్‌కు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్!?
టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలు మొదలుకుని చిన్న చిన్న సినిమాలు షూటింగ్స్, రిలీజ్లు సర్వం ఆగిపోయాయి. కరోనా ఉధృతి ఎప్పుడెప్పుడు తగ్గుతుందా..? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా..!? అని దర్శకనిర్మాతలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. మరోవైపు తమ అభిమాన హీరో నటించిన ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. టాలీవుడ్‌కు త్వరలోనే మంచి రోజులొస్తాయని చెప్పారు. ఆ మంచి రోజులు ఎప్పట్నుంచా అని అటు నటీనటులు.. ఇటు దర్శకనిర్మాతలు వేచి చూస్తున్నారు. జూన్ నుంచి షూటింగ్స్ షురూ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది కానీ.. ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. అయితే కోలీవుడ్‌లో లాగా కొన్ని కండిషన్స్ పెట్టి షూటింగ్, రిలీజ్లు చేసుకోవచ్చని ప్రభుత్వాలు చెబితే టాలీవుడ్ పనులు జరిగిపోతాయ్ లేకుంటే ఇంకా ఆలస్యమే అవుతుంది.
లాక్ డౌన్ 4.0 కూడా!?
లాక్ డౌన్ 4.0 కూడా ఉండే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయ్. ఎందుకంటే దేశ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే కానీ అస్సలు తగ్గట్లేదు. దీంతో లాక్ డౌన్ 4.0 విధించి నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. ఇదే జరిగితే జూన్‌లో కూడా కష్టమే. ఇప్పటికే చాలా సడలింపులు ఇచ్చిన కేంద్రం 4.0లో సినిమా ఇండస్ట్రీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయ్. మరి ఇది ఎంతవరకు నిజమో.. ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments