టైటిల్ పెట్టారో లేదో ట్రబుల్ వచ్చింది
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ కి లింగ` సినిమా నుండి ఏదో ఒక రకంగా సమస్యలు వస్తునే ఉన్నాయి. తాజాగా ఆయన పా రంజిత్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకి కబాలి` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే శివ కుమార్ అనే దర్శక నిర్మాత ఆ టైటిల్ తనదని, తను ఆ పేరుతో 90 శాతం సినిమాని పూర్తి చేసుకున్నానని, అయితే నిన్న రెన్యూవల్ కి వెళ్లిన తనని రెన్యూవల్ చేయకుండా అడ్డగించారని చెప్పుకొచ్చాడు.
అయితే తాము చాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో సంప్రదించిన తర్వాతే టైటిల్ విషయంలో నిర్ణయం తీసుకున్నామని, అయితే సమస్య రావడం బాధాకరమని, దానికి పరిష్కారం ఆలోచిస్తున్నామని రజనీకాంత్ నిర్మాత కలైపులి థాను చెప్పుకొచ్చాడు. మరి ఈ సమస్య ఎలా తీరుతుందో చూద్దాం...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout