పూరి నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే..!
Send us your feedback to audioarticles@vaarta.com
డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కళ్యాణ్ రామ్ తో ఇజం చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నెలాఖరుకు స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసి సెప్టెంబర్ 29న ఇజం చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...పూరి జగన్నాథ్ ఇజం తర్వాత యువ హీరో నాగ శౌర్యతో సినిమా చేయనున్నారు.
డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందే ఈ చిత్రానికి స్ర్కిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు సమాచారం. అయితే...ఫిల్మ్ ఛాంబర్ లో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై రొమాంటిక్ అనే టైటిల్ రిజిష్టర్ చేసారు. ఈ టైటిల్ నాగ శౌర్య మూవీ కోసమే అని సమాచారం. మరి...రొమాంటిక్ అనే టైటిల్ తో నాగ శౌర్యను పూరి ఎలా చూపిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com