బాలకృష్ణ టైటిల్ ఖరారైందా..!
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బీబీ3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందిన సింహా, లెజెండ్ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ మూవీస్‌గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను మే 28న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా టైటిల్ మాత్రం ఇప్పటి వరకు రివీల్ కాలేదు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. త్వరలోనే టైటిల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడతుందని టాక్. ఇందులో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపిస్తాడు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో.. మరో హీరోయిన్ పూర్ణ కీలక పాత్రలో నటిస్తుంది.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే వారం నుంచి కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేశాడు బోయపాటి శ్రీను. కంటిన్యూగా జరిగే ఈ షెడ్యూల్ చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తవుతుందట. ఇప్పటి వరకు అరవై శాతం షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com