హిందీలో పేరు మార్చలేదు...
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లవ్‌స్టోరి `అర్జున్ రెడ్డి` సెన్సేషనల్ హిట్ సాధించింది. దీన్ని తమిళంతో పాటు హిందీలో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో `వర్మ` అనే టైటిల్‌తో బాలా దర్శకత్వంలో రూపొందుతుంది. ఇందులో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పుడు హిందీ వెర్షన్ స్టార్ట్ అయింది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. సందీప్ రెడ్డినే డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు హిందీలో కూడా తెలుగు టైటిల్ `అర్జున్ రెడ్డి`నే ఫిక్స్ చేశారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. నిర్మాతలు టైటిల్ పోస్టర్‌ను రివీల్ చేశారు. మరి సందీప్ బాలీవుడ్లో అర్జున్ రెడ్డిని ఎలా చూపించనున్నాడనేది ఆసక్తిరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com