ముస్తాబవుతున్న 'టైటానిక్'

  • IndiaGlitz, [Tuesday,February 02 2016]

రాజీవ్ సాలూరి, యామిని భాస్క‌ర్ హీరో హీరోయిన్లుగా క‌న్నా సినీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నూత‌న చిత్రం టైటానిక్'.అంత‌ర్వేది టు అమ‌లాపురం' ట్యాగ్ లైన్. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. జి.రాజ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో కె.శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా...

స‌హ నిర్మాత అట్టూరి సురేష్‌బాబు మాట్లాడుతూ ''టైటానిక్' చిత్రం ఫుల్ ప్యామిలీ కామెడి ఎంటర్‌టైన‌ర్‌. అంత‌ర్వేది నుండి అమ‌లాపురం' వ‌ర‌కు గోదావ‌రి న‌దిలో టైటానిక్ అనే లాంచీలో జ‌రిగే క‌థే ఇది. పెళ్ళి బృందం కామెడితో సినిమా సరదాగా సాగుతుంది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇందులో పెళ్ళి కొడుకుగా న‌టించాడు. రాజీవ్ సాలూరి, యామినీ భాస్కర్ హీరో హీరోయిన్స్ గా చేశారు. ర‌ఘుబాబు విల‌న్‌గా న‌టించారు. అలాగే జ‌బ‌ర్‌ద‌స్త్ టీం కామెడి సినిమాకు ప్ల‌స్ అవుతుంది. నవంబర్ 18 నుండి డిసెంబర్ 22వరకు నిరవధికంగా జరిగిన చిత్రీకరణతో సినిమా మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాల్లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఆడియో, సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.