రామ్ చరణ్ చిత్రంలో డిల్లీ భామ...
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బ్రూస్ లీ. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదల కానుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కృతికర్భందా, రామ్‌చరణ్ అక్క పాత్రలోకనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో టిస్కా చోప్రా అనే డిల్లీ భామ నటించనుందట. మొగిలిపువ్వు, ఎబిసిడి మినహాయిస్తే ఇప్పటి వరకు టిస్కా చోప్రా ఎక్కువగా బాలీవుడ్‌లోనే కనిపించింది. ఇప్పుడు బ్రూస్‌లీతో మరోసారి తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరి ఈ చిత్రంలో ఆమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments