Tirupati MP Gurumurthy:మాతంగి గెటప్‌లో వైసీపీ ఎంపీ : బన్నీని దింపేశాడుగా .. ఇది పుష్పగాడి రూల్ అంటోన్న ఫ్యాన్స్, ఫోటోలు వైరల్

  • IndiaGlitz, [Monday,May 15 2023]

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, ఫైట్స్‌ ప్రజలను విశేషంగా అలరించాయి. ఎక్కడ చూసినా పుష్ప పేరు బాగా వినిపించింది. వయసుతో సంబంధం లేకుండా ‘‘తగ్గేదే లే’’ అంటూ పుష్ప సినిమా డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరిజాన్ని అనుకరించారు. వీరిలో సినీతారలు, క్రీడాకారులు చివరికి రాజకీయ నాయకులు కూడా వున్నారు. ముఖ్యంగా చిన్నారులైతే మెడ కిందగా చేతులు పోనిస్తూ నానా అల్లరి చేస్తున్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పలు పార్టీలు ప్రచారానికి పుష్ప సినిమాను వాడుకున్నాయి. పుష్ప సినిమాను భాషతో సంబంధం లేకుండా దేశప్రజలు ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకొంటున్నారు.

బన్నీ మాతంగి గెటప్‌కు ఫ్యాన్స్ ఫిదా :

ఇంతటి ప్రభంజనం సృష్టించిన పుష్పకి సీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కాకుండానే పుష్ప 2 కూడా అభిమానులను ఊపేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా గ్లింప్స్‌లో అల్లు అర్జున్ మాతంగి గెటప్‌ మాస్‌కి పూనకాలు తెప్పించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ గెటప్ వేసుకుని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఏకంగా ఓ ఎంపీ చేరిపోయారు. ఆయన ఎవరో కాదు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి. ఆయన వేసిన మాతంగి గెటప్ వైరల్ అవుతోంది.

అమ్మవారి జాతర కోసం మాతంగి గెటప్ వేసిన వైసీపీ ఎంపీ :

వివరాల్లోకి వెళితే.. తిరుపతి తాతయ్యగుంటలోని ప్రఖ్యాత గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సమీపంలోనే వున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు వేసిన వేషాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎంపీ గురుమూర్తి మాతంగి గెటప్ వేసి.. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గంగమ్మ భక్తి చైతన్య యాత్రలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మాతంగి గెటప్‌లో ఎంపీ కనిపించడంతో భక్తులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. కొందరైతే ఆయనతో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అనంతరం అదే వేషధారణలో అనంత వీధి నుంచి గంగమ్మ ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లిన గురుమూర్తి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

More News

Sudipto Sen:'ది కేరళ స్టోరీ' దర్శకుడు , హీరోయిన్‌ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు

దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలరం రేపిన సినిమా ‘‘ ది కేరళ స్టోరీ’’.

Prabhas : మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. భద్రాద్రి రామయ్యకు భారీ విరాళం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సేవాగుణాన్ని చాటుకున్నారు. తెలుగువారి ఆరాధ్య దైవం భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ఆయన రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు.

Venky Atluri:టాలీవుడ్‌లో సెన్సేషనల్ : వెంకీ అట్లూరితో దుల్కర్ సల్మాన్.. ఈసారి అంతకుమించి..!!

దుల్కర్ సల్మాన్.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడు. తన మాతృభాషలో సినిమాలు చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రభంజనం కారణంగా

Chandrababu Naidu:చంద్రబాబుకు జగన్ మార్క్ షాక్.. ఉండవల్లి గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసిన ఏపీ సర్కార్

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు జగన్ ప్రభుత్వం గట్టి షాకిచ్చింది.

Vimanam:తండ్రీ కొడుకుల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ‘విమానం’... హృద‌యాల‌ను క‌దిలించేలా టీజ‌ర్‌

వీర‌య్య అంగ వైక్య‌లంతో ఇబ్బంది ప‌డుతున్నా కొడుకుని మాత్రం ఎంతో ప్రేమ‌గా చూసుకుంటుంటాడు.