Tirupati MP Gurumurthy:మాతంగి గెటప్‌లో వైసీపీ ఎంపీ : బన్నీని దింపేశాడుగా .. ఇది పుష్పగాడి రూల్ అంటోన్న ఫ్యాన్స్, ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, ఫైట్స్ ప్రజలను విశేషంగా అలరించాయి. ఎక్కడ చూసినా పుష్ప పేరు బాగా వినిపించింది. వయసుతో సంబంధం లేకుండా ‘‘తగ్గేదే లే’’ అంటూ పుష్ప సినిమా డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరిజాన్ని అనుకరించారు. వీరిలో సినీతారలు, క్రీడాకారులు చివరికి రాజకీయ నాయకులు కూడా వున్నారు. ముఖ్యంగా చిన్నారులైతే మెడ కిందగా చేతులు పోనిస్తూ నానా అల్లరి చేస్తున్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పలు పార్టీలు ప్రచారానికి పుష్ప సినిమాను వాడుకున్నాయి. పుష్ప సినిమాను భాషతో సంబంధం లేకుండా దేశప్రజలు ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకొంటున్నారు.
బన్నీ మాతంగి గెటప్‌కు ఫ్యాన్స్ ఫిదా :
ఇంతటి ప్రభంజనం సృష్టించిన పుష్పకి సీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కాకుండానే పుష్ప 2 కూడా అభిమానులను ఊపేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా గ్లింప్స్‌లో అల్లు అర్జున్ మాతంగి గెటప్ మాస్‌కి పూనకాలు తెప్పించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ గెటప్ వేసుకుని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఏకంగా ఓ ఎంపీ చేరిపోయారు. ఆయన ఎవరో కాదు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి. ఆయన వేసిన మాతంగి గెటప్ వైరల్ అవుతోంది.
అమ్మవారి జాతర కోసం మాతంగి గెటప్ వేసిన వైసీపీ ఎంపీ :
వివరాల్లోకి వెళితే.. తిరుపతి తాతయ్యగుంటలోని ప్రఖ్యాత గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సమీపంలోనే వున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు వేసిన వేషాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎంపీ గురుమూర్తి మాతంగి గెటప్ వేసి.. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గంగమ్మ భక్తి చైతన్య యాత్రలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మాతంగి గెటప్‌లో ఎంపీ కనిపించడంతో భక్తులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. కొందరైతే ఆయనతో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అనంతరం అదే వేషధారణలో అనంత వీధి నుంచి గంగమ్మ ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లిన గురుమూర్తి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout